వీడు మగాడ్రా బుజ్జీ... భార్య, ప్రియురాలితో కలిసొచ్చిన ఫ్యాన్, ఆ ట్రిక్ తనకూ చెప్పమన్న టాప్ హీరో

Published : Sep 06, 2025, 11:38 AM IST

ఈ స్టోరీ చదివాక ‘వీడు మగాడ్రా బుజ్జీ’ అని మీకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మగాడికి కాదుకాదు మొగుడికి సాధ్యంకాని ఫీట్ ను చేసి ఓ స్టార్ హీరోతోనే ఆ ట్రిక్ ఏంటో తనకూ చెప్పమని బ్రతిమాలించుకున్నాడు. అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం… 

PREV
15
ఇతడు మామూలోడు కాదు..

భార్యభర్తల మధ్య మరో స్త్రీ వచ్చిందంటే ఆ సంసారం నరకమే. అందుకే చాలామంది భర్తలు తమ భార్యల ముందు మరో మహిళ గురించి మాట్లాడేందుకే జంకుతారు. ఇక కొందరు తప్పని పరిస్థితుల్లో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నా గుట్టుగా ఒకరికి తెలియకుండా ఒకరితో సంసారం సాగిస్తుంటారు. ఈ విషయం ఆ ఇద్దరు భార్యలకు తెలిసిందో ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి కట్టుకున్న భార్య ఉండగానే మరో అమ్మాయిని ప్రేమించాడు... అంతేకాదు ఈ ఇద్దరికి తీసుకుని ఓ టీవి షో కు వెళ్లాడు. ఇతడు ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్ల చేత 'వీడు మగాడ్రా బుజ్జీ' అనిపించుకుంటున్నాడు.

25
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఫ్యాన్ దెబ్బకు స్టార్ హీరోలే షాక్...

ఇంతకూ విషయం ఏంటంటే... భారతదేశంలోని ప్రముఖ టీవి షోస్ లో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' ఒకటి. హిందీలో ప్రసారమయ్యే ఈ టీవి షోకు సినిమా లెవెల్ క్రేజ్ ఉంటుంది. షోకు వచ్చే అతిథులు, జడ్జిలతోనే కాదు ప్రేక్షకులతో కూడా యాంకర్ కపిల్ శర్మ సరదాగా మాట్లాడుతూ కామెడీని పండిస్తుంటారు. ఇలా తాజా ఎపిసోడ్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, సునీల్ శెట్టి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నెట్ ప్లిక్స్ విడుదల చేసింది. ఇది చాలా ఫన్నీగా సాగింది.

35
ఈ కాలపు సూపర్ మ్యాన్...

అయితే ప్రోమో మధ్యలో ఓ ఆసక్తికర సీన్ కనిపిస్తోంది. ఆడియన్స్ లో ఓ వ్యక్తి మాట్లాడుతున్న వీడియోను ప్రోమోలో చూపించారు. ఇందులో అతడు తాను భార్య, ప్రియురాలితో కలిసి వచ్చినట్లు చెబుతున్నాడు. అతడి మాటలు విని హీరోలు సంజయ్ దత్, సునీల్ శెట్టితో పాటు కపిల్ శర్మ, జడ్జ్ అర్చనా పూరన్ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సంజయ్ దత్ అయితే అతడితో ''నువ్వు ఇది ఎలా చేశావు? మాకు కూడా నేర్చించవా?'' అంటూ దగ్గరికెళ్లిమరీ అడిగారు. ఇలా కపిల్ శర్మ షోలో పాల్గొన్న అతిథులు, కామెడీ కంటే ఫ్యాన్ వ్యవహరమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

45
సంజయ్ దత్ షాక్... ఈ ఫ్యాన్ రాక్

ఇలా భార్య, ప్రియురాలితో కలిసి కపిల్ శర్మ షోకు వచ్చిన ఫ్యాన్ గురించి నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'సంజయ్ దత్, సునీల్ శెట్టి షాక్... కానీ బ్రో నువ్వు రాక్'' అంటూ కొందరు... 'ఇది షోపై ఆసక్తిని పెంచేందుకు చేసిన జిమ్మిక్కు'' అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ''ఇదికదా వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేయడమంటే'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

55
సంజయ్ దత్ ఫ్యామిలీ లైఫ్

సంజయ్ దత్ కు ఇప్పటికే మూడు పెళ్ళిళ్లు అయ్యాయి. 1987 లో మొదట రీచాతో పెళ్లికాగా 1996 లో ఆమె బ్రెయిన్ ట్యూమర్ కారణంగా చనిపోయారు. తర్వాత రేఖా పిళ్లైని 1998 లో పెళ్లాడారు... కానీ 2008 లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం మాన్యతా దత్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే మూడు పెళ్లిల్లు చేసుకున్నప్పటికీ సంజయ్ దత్ సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లతో ప్రేమాయణం సాగిస్తున్నాడనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంటుంది.

లగేరహే మున్నాభాయి సినిమా యాక్టర్ తో హీరో సంజయ్ దత్ ప్రేమాయణం సాగిస్తున్నాడే ప్రచారం గతంలో జోరుగా సాగింది. అంతేకాదు బాలీవుడ్ యాక్టర్స్ మాధురి దీక్షిత్, టీనా మునిమ్ తో సంజయ్ ధత్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కూడా తెగ ప్రచారం జరిగింది. ఇలా చాలామంది మహిళలతో పెళ్లి, ప్రేమాయణ సాగించిన సంజయ్ దత్ భార్య, ప్రియురాలితో కలిసివచ్చిన ఫ్యాన్ తో చేసిన సరదా కామెంట్స్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories