కృష్ణంరాజుని తక్కువ అంచనా వేసి చావుదెబ్బ తిన్న బాలయ్య, బొబ్బిలి బ్రహ్మన్నకి పోటీగా వెళ్లడంతో అట్టర్ ఫ్లాప్

Published : Sep 06, 2025, 10:29 AM IST

బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం కృష్ణంరాజు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రానికి పోటీగా వెళ్లిన బాలయ్య సినిమా అడ్రెస్ లేకుండా పోయింది. ఆ మూవీ ఏంటో ఈ కథనంలో చూద్దాం. 

PREV
15

1984లో విడుదలైన మంగమ్మ గారి మనవడు చిత్రంతో బాలయ్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. బాలయ్యకి తొలి సోలో బ్లాక్ బస్టర్ చిత్రం అది. అంతకు ముందు బాలయ్య నటించిన చిత్రాలన్నీ యావరేజ్ లు, ఫ్లాప్ లు అవుతూ వచ్చాయి. ఒకసారి బాలయ్య.. రెబల్ స్టార్ కృష్ణంరాజుని తక్కువగా అంచనా వేసి చావు దెబ్బ తిన్నారు. ఆ టైం లో కృష్ణంరాజు మంచి జోరు మీద ఉన్నారు. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలు చేస్తున్నారు. 

25

కృష్ణం రాజు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, కృష్ణవేణి లాంటి సినిమాలు ఉంటాయి. అదే బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాన్ని కూడా ఎవరూ మరచిపోలేరు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. శారద, జయసుధ, రావుగోపాలరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో కృష్ణంరాజు తన రెబల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. దీనితో ఈ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. 

35

కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాన్ని తక్కువగా అంచనా వేసిన బాలయ్య ఆ మూవీకి వారం గ్యాప్ లోనే తన జనని జన్మభూమి చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అప్పటికి బాలయ్య స్టార్ హీరో కూడా కాదు. బొబ్బిలి బ్రహ్మన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద గర్జన చేస్తుండడంతో జనని జన్మభూమి మూవీ నిలబడలేకపోయింది. తక్కువ రోజుల్లోనే థియేటర్ల నుంచి ఆ చిత్రం కనుమరుగైంది. అప్పట్లో బాలయ్య కెరీర్ లో ఈ చిత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. 

45

జనని జన్మభూమి చిత్రం కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీలో సుమలత హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో బాలయ్య మంగమ్మ గారి మనవడు చిత్రంతో వచ్చారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్ ని పూర్తిగా మార్చేసింది.

55

మంగమ్మగారి మనవడు మూవీతో బాలయ్య హిట్ సినిమాల కరువు తీరింది. బొబ్బిలి బ్రహ్మన్న విషయానికి వస్తే.. ఈ చిత్రం ఏకంగా మూడు నంది అవార్డులు కొల్లగొట్టింది. ఉత్తమ నటుడిగా కృష్ణంరాజు నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా శారద, ఉత్తమ దర్శకుడిగా రాఘవేంద్రరావు కూడా నంది అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా కృష్ణంరాజుకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది. 

Read more Photos on
click me!

Recommended Stories