Chiranjeevi: ఒక లతా మంగేష్కర్‌, ఒక అమితాబ్‌, ఒక చిరంజీవి.. మనవాళ్లు మనకు నచ్చరు.. వివి వినాయక్‌ సెటైర్లు

Published : Jan 26, 2026, 09:16 AM IST

లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌, ఒక అమితాబ్‌ బచ్చన్‌ లాగా చిరంజీవి గారు గొప్ప పేరుని సంపాదించుకున్నారని తెలిపారు వినాయక్‌. ఈ సందర్భంగా ఆయన క్రేజీగా సెటైర్లు పేల్చారు. 

PREV
15
రూ.350కోట్లు వసూలు చేసిన `మన శంకర వర ప్రసాద్‌ గారు`

చిరంజీవి హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఇప్పటికే రూ.350కోట్లు దాటినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్‌ ఈవెంట్‌ ని నిర్వహించారు. ఇందులో చిరంజీవి, వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి, రాఘవేంద్రరావు, వివి వినాయక్‌, దిల్‌ రాజు, సుస్మిత కొణిదెల, సాహు గారపాటితోపాటు చిత్ర బృందం, ఇతర గెస్ట్ లు పాల్గొన్నారు. చిరంజీవికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాన్ని వినాయక్‌ పంచుకున్నారు.

25
మెగాస్టార్‌ గొప్పతనం పంచుకున్న వినాయక్‌

చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్‌ సినిమా ఈవెంట్‌కి వచ్చారు. ఆయన ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. చివరగా హిందీలో `ఛత్రపతి` రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఆడలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమాలకు దూరంగానే ఉన్నారు. అయితే చిరంజీవితో ఆయన `ఠాగూర్‌`, `ఖైదీ నెం 150` చిత్రాలు రూపొందించారు. ఈ రెండూ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. చిరు కెరీర్‌లో మైలురాయిలాంటి చిత్రాలుగా నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన మెగాస్టార్‌ హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్‌లో పాల్గొని తన సంతోషాన్ని పంచుకున్నారు. టీమ్‌కి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి గొప్పతనం గురించి చెబుతూ ఓ సంఘటనని రివీల్‌ చేశారు.

35
లతా మంగేష్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌లకు గౌరవం

తాను ముంబయి జూహులోని మారియట్‌ హోటల్‌లో లాబీలో కూర్చుంటే ఒకసారి లతా మంగేష్కర్‌ వచ్చారట. ఆమె రాకతో లాబీలోని అందరు లేచి నిలబడ్డారట. నమస్కారం చేసి, ఆమె వెళ్లే వరకు నిల్చోనే ఉన్నారట. ఆమె కూడా అందరికి నమస్కారం చేస్తూ లోపలికి వెళ్లిపోయారట. చాలా కాలం తర్వాత అదే మారియట్‌ హోటల్లో తాను ఉన్నప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ వచ్చారట. అప్పుడు కూడా సేమ్‌. లాబీలో ఉన్న వారంతా లేచి నిలబడి, ఆయనకు సమస్కారం చేశారు. ఆయన కూడా నమస్కారం చేసుకుంటూ వెళ్లిపోయారట.

45
చెన్నై ఎయిర్‌పోర్ట్ లో చిరంజీవికి గౌరవం

అలాంటి సంఘటనే అన్నయ్య(చిరంజీవి) విషయంలో జరిగిందని తెలిపారు దర్శకుడు వినాయక్‌. `ఖైదీ నెం 150` మూవీ షూటింగ్‌ ని పూర్తి చేసుకుని చెన్నై ఎయిర్‌ పోర్ట్ కి వినాయక్‌ వచ్చారట. ముందుగా వచ్చి తాను కూర్చున్నాడట. ఆ తర్వాత ఫ్లైట్‌ టైమ్‌కి చిరంజీవి వచ్చారట. మెగాస్టార్‌ రావడంతోనే అక్కడ లాంజీలో కూర్చున్న వారంతా సైలెంట్‌గా లేచి నిలబడి నమస్కారం చేశారట. అది చూసిన తనకు ఎంతో ఆనందం వేసిందని తెలిపారు వినాయక్‌. పక్క రాష్ట్రంలో కూడా ఆయన్ని గౌరవిస్తున్నారంటే, అది ఆయన సంపాదించిన గొప్ప పేరుకి నిదర్శనం అని చెప్పారు.  అయితే వినాయక్‌ మాటలకు ఈవెంట్‌లో రియాక్ట్ కాలేదు. దీంతో `ఏ క్లాప్స్ కొట్టరా? నచ్చడం లేదా? అంతే మనకు మనం నచ్చం` అంటూ నవ్వుతూ సెటైర్లు పేల్చారు వినాయక్‌. దీంతో అంతా క్లాప్స్ కొట్టడం విశేషం.

55
చిరంజీవిగారితో సినిమా చేస్తే ఆ కిక్కే వేరు

ఇక `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ విషయంలో చాలా మంది తనకు ఫోన్‌ చేసి టికెట్లు అడిగారని, అయితే అందరు చిరంజీవిగారి సినిమా అన్నారు తప్పితే, ఒక్కరు కూడా చిరంజీవి సినిమా అనలేదు. అది మీరు(చిరంజీవి) సంపాదించుకున్న మర్యాద, హోదా, హ్యాట్సాఫ్‌ టూ అన్నయ్య` అని తెలిపారు వినాయక్‌. ఆయన ఇంకా మాట్లాడుతూ, `ఈ సినిమా క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అనిల్ కి చెందుతుంది. చిరంజీవి గారికి కథ రాయడం మామూలు విషయం కాదు. 25 రోజుల్లో కథ రాసి అందులోనూ వెంకటేష్ గారిని పెట్టి అద్భుతంగా సినిమాను తీశాడు. వెంకీ గారి కాంబినేషన్ అద్భుతంగా ఉంది. చిరంజీవిగారితో రెండు సినిమాలు తీయడం నాకు ఎంతో ఆనందం. నాకు ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమాలవి. ఆయనతో సినిమా తీయడంలో ఉన్న కిక్కు వేరు. మా అందరికీ అవకాశాలు ఇచ్చిన చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు` అని తెలిపారు వినాయక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories