Karthika Deepam 2 Today Episode: నిజం చెప్పిన డాక్టర్- తెలివిగా తప్పించుకున్న జ్యో-మొదలైన అనుమానం

Published : Jan 26, 2026, 08:07 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 26వ తేదీ)లో జ్యోను అనుమానిస్తుంది పారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది జ్యో. నిజం చెప్తుంది డాక్టర్. హాస్పిటల్ పై నిందవేసి తెలివిగా తప్పించుకుంటుంది జ్యో. ఆరాతీస్తుంది కాంచన. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్‌ లో దాసుతో ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగిన జ్యోత్స్నకు పారిజాతం కనిపిస్తుంది. షాక్ అవుతుంది జ్యోత్స్న. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది పారు. ఫ్రెండ్ తో అని చెప్తుంది జ్యో. దాసు ఇంటికి రావడం నువ్వు నిజంగా చూడలేదా? లేక కావాలనే అబద్ధం చెప్పావా అని జ్యోపై అనుమానపడుతుంది పారు. ఓ వైపు నా జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తుంటే.. నాకు హెల్ప్ చేయడం మానేసి, పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావా అని పారుపై అరుస్తుంది జ్యో. దీన్ని ఎలా కాపాడాలో ఆలోచించాలి అనుకుంటుంది పారిజాతం.

28
డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు

బయటకు వెళ్లడానికి రెడీ అవుతుంటుంది జ్యోత్స్న. ఎక్కడికే అని అడుగుతుంది పారిజాతం. చెప్పను. కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది అంటుంది జ్యో. మీ తాత అడిగితే ఏం చెప్పాలే అంటుంది పారు. ఎక్కడికి వెళ్లానో తెలియదని చెప్పు అంటుంది జ్యో. ఈ రోజు రిపోర్ట్స్ వస్తాయని భయపడుతున్నావా అంటుంది పారు. డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు అని ధైర్యంగా చెప్తుంది జ్యోత్స్న. డాక్టర్ ని ఏమైనా చేశావా? అని భయపడుతుంది పారు. ఏం చేయలేదు అని కిందకు వెళ్తుంది జ్యో. అప్పుడే డాక్టర్ హారిక రిపోర్ట్స్ తీసుకొని ఇంట్లోకి వస్తుంది.

38
భయంతో వణికిపోయిన జ్యో

అది చూసి జ్యోత్స్న భయంతో గదిలోకి వెళ్తుంది. గ్రానీ డాక్టర్ హారిక రిపోర్ట్స తీసుకొని వచ్చారు అని చెప్తుంది. ఇప్పుడే కదా డాక్టర్ రాదు అని చెప్పావు అంటుంది పారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె ఈ రోజు వేరే సర్జరీకి వెళ్లాలి. కానీ ఎందుకు వచ్చిందో అని టెన్షన్ పడుతుంటుంది జ్యోత్స్న. పైకి వెళ్లి జ్యోత్స్న, పారిజాతంలను పిలుచుకురమ్మని దీపను పంపిస్తాడు శివన్నారాయణ. నువ్వు బాల్కనీలో నుంచి దూకి కిందకు పారిపో జ్యోత్స్న అంటుంది పారు. పారిపోతే సమస్య తీరిపోదు అంటుంది జ్యో. 

48
అడ్డంగా దొరికిపోయాను

ఇంతలో దీప వచ్చి మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారు అని చెప్తుంది. భయపడుతూనే ఇద్దరూ కిందకు వెళ్తారు.ఇక నా పని అయిపోయింది. తప్పించుకునే వీలు లేదు. ఇక దాసు కూతురులాగే జీవితాంతం బతకాలి అనుకుంటూ కిందకు వెళ్తుంది జ్యోత్స్న. నిజానికి నేను రేపు రావాల్సింది. కానీ కార్తీక్ ఈరోజే రమ్మన్నాడు అని చెప్తుంది డాక్టర్. ఎందుకురా అని అడుగుతుంది పారు. జ్యోత్స్న బాధ చూడలేక రమ్మన్నాను పారు. ఇందాక తను అత్త గురించి ఎంత బాధపడిందో మనం చూశాం కదా అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్.

58
నిజం చెప్పిన డాక్టర్

రిపోర్ట్ వచ్చాయి కదా ఇక ఆలస్యం చేయకుండా చెల్లెమ్మను హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అంటాడు శ్రీధర్. డాక్టర్ మీరు చెప్పండి ఏం చేద్దాం అంటాడు శివన్నారాయణ. మీ మనుమరాలి బ్లడ్ శాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ కాలేదు అని నిజం చెప్తుంది డాక్టర్. అంతా షాక్ అవుతారు. మ్యాచ్ కాకపోవడం ఏంటి? అంటే జ్యోత్స్న మా అత్త కూతురు కాదా? అంటాడు కార్తీక్. మేము రెండు మూడు సార్లు చెక్ చేశాం అదే రిజల్ట్ వచ్చింది అని చెప్తుంది డాక్టర్.

68
మీరే ఎక్కడో తప్పు చేశారు

తప్పును డాక్టర్ పైకి తోసేస్తుంది జ్యోత్స్న. శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అంటే తప్పు నాది కాదు, టెస్ట్‌లు సరిగా చేయని మీది. నాకు మొదటి నుంచి మీ ట్రీట్‌మెంట్ మీద నమ్మకం లేదని అంటుంది జ్యోత్స్న. వీళ్లను నమ్ముకొని ట్రీట్‌మెంట్ చేయించి లాభం లేదు. మనం కెనడా వెళ్దాం. అక్కడ నా ఫ్రెండ్ ఉంది. మమ్మీ త్వరగా రికవరీ అవుతుంది అని దశరథతో చెప్తుంది జ్యోత్స్న.

78
దశరథలో మొదలైన అనుమానం

హారిక గారు బెస్ట్ డాక్టర్. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. తప్పు ఎక్కడైనా జరగనీ.. కానీ నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అంటాడు దశరథ. రిపోర్ట్స్ ఇచ్చి సైలెంట్ గా వెళ్లిపోతుంది డాక్టర్. నా కూతురు పెళ్లి చూసే యోగం నాకు లేదు అని బాధపడుతుంది సుమిత్ర. నీకు ఏం కాదు అని ధైర్యం చెబుతాడు దశరథ. అంతా తలో వైపు వెళ్లిపోతారు. డాక్టర్ చెప్పింది నిజమేనా అనే అనుమానం దశరథలో మొదలవుతుంది.

88
నిలదీసిన కాంచన

మరోవైపు దీప, కార్తీక్ లపై డౌట్ పడుతుంది కాంచన. మీ ఇద్దరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని నిలదీస్తుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెబితే అంతా షాక్ అయ్యారు కానీ మీ ఇద్దరూ, పారిజాతం పిన్ని, జ్యోత్స్న మాత్రం భయపడ్డారు. మీకు ముందే తెలుసు కదా శాంపిల్స్ మ్చాచ్ కావని అని అడుగుతుంది కాంచన. వాళ్లకు ఎలా తెలుస్తాయి అని అడుగుతాడు శ్రీధర్. 

వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. వీళ్లు మన దగ్గర ఏదో దాస్తున్నారు అని అంటుంది కాంచన. మాట మార్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు కాంచన అంటాడు శ్రీధర్. నేను ఆలోచించడానికి, అనుమానించడానికి నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయండి అంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories