ప్రభాస్ 'స్పిరిట్' మూవీ వివాదంలో దీపికా పదుకొనేకి 12th ఫెయిల్ హీరో మద్దతు.. తల్లి ఆమె డిమాండ్ సరైందే

Published : Jul 05, 2025, 09:52 PM IST

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న "స్పిరిట్" చిత్రం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.

PREV
15

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న "స్పిరిట్" చిత్రం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆమె దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి చాలా నిబంధనలు పెట్టిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె 8 గంటల వర్క్ డే డిమాండ్ విధించినట్లు ఇండస్ట్రీలో చర్చ జరిగింది. 

25

ఆమె ‘ఛపాక్’ చిత్ర సహనటుడు విక్రాంత్ మాస్సీ ఈ అంశంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో విక్రాంత్ మాట్లాడుతూ, “ఆమె చేసిన డిమాండ్ తప్పేమీ కాదు. నాకు కూడా అలాంటి ఆలోచనే ఉంది. త్వరలోనే నేను కూడా వర్క్ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే అదే సమయంలో, ఇది ఒక ఎంపికగా ఉండాలి. ఒకవేళ నిర్మాత అటువంటి షెడ్యూల్‌కు ఒప్పుకోలేకపోతే, వారి నిర్ణయాన్ని కూడా గౌరవించాలి. సినిమా తీయడంలో అనేక అంశాలు పనిచేస్తాయి,” అని వ్యాఖ్యానించారు.

35

ఇక పారితోషికం విషయానికి వస్తే, “ఒకవేళ నేను 12 గంటలు పని చేయలేనప్పుడు నా రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తా. ఇది ఒక గివ్ అండ్ టేక్ వ్యవహారం. కానీ దీపికా పదుకొనె తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటప్పుడు ఆమె 8 గంటల వర్క్ అడగడం సమంజసమే అని విక్రాంత్ తెలిపారు. 

45

స్పిరిట్ సినిమాకు సంబంధించిన వివాదాలపై గతంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ మర్మమైన పోస్టును సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో "పీఆర్ గేమ్స్", "ట్రస్ట్" వంటి పదాలు ఉండటంతో దీపికా విషయంలోనే అని ఊహాగానాలు చెలరేగాయి.అలాగే దీపికా పదుకొనె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణం, ఆమె అధిక పారితోషిక డిమాండ్ చేయడం, లాభాల్లో షేర్ అడగడం, అదే విధంగా వర్క్ విషయంలో కొన్ని డిమాండ్లు పెట్టడమే అని అంటున్నారు. దీపికా ఈ చిత్రం నుంచి తప్పుకున్న తర్వాత తృప్తి డిమ్రిని సందీప్ రెడ్డి వంగా హీరోయిన్ గా ఎంపిక చేశారు. 

55

ప్రస్తుతం విక్రాంత్ మాస్సీ "ఆంఖోంకి గుస్తాఖియాన్" అనే చిత్రంలో శనయా కపూర్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదల కానుంది.ఇదిలా ఉండగా దీపికా పదుకొనె.. అల్లు అర్జున్ సరసన, అట్లీ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతోంది. అదే విధంగా ప్రభాస్ కల్కి 2లో ఆమె నటించాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories