నయనతార కాదు టాలీవుడ్ లో ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారు?

Published : Oct 12, 2025, 03:28 PM IST

లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికి నయనతార గుర్తుకు వస్తుంది. కానీ టాలీవుడ్ లో మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? తెలుగు పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ఎవరు? సౌత్ లో లేడీ సూపర్ స్టార్ బిరుదు ఇంకా ఎవరికి ఉండేదంటే? 

PREV
16
హీరోలకు మాత్రమే బిరుదులు

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే బిరుదులు ఉంటుంటాయి. రామ్ చరణ్ కు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, ఎన్టీఆర్ కు యంగ్ టైగర్, చిరంజీవికి మెగాస్టార్, బాలయ్యకు నటసింహం ఇలా స్టార్ హీరోలకు ఇండస్ట్రీ వర్గాలు, ఫ్యాన్స్ రకరకాల బిరుదు, ట్యాగ్ లు ఇస్తుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ వల్ల ఎక్కువగా వారికే ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాల విషయంలో హీరోలు చెప్పినదే నడుస్తుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల మాట కాదని ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఈతరం హీరోలు సినిమాలకోసం ఎంతో కష్టపడుతున్నారు. సాహసాలు కూడా చేస్తున్నారు. దాంతో వారి పక్కన బిరుదులు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటున్నాయి. అయితే అంతే పవర్ చూపించిన కొంతమంది హీరోయిన్లక కూడా స్పెషల్ ట్యాగ్ లు ఇస్తున్నారు ఫ్యాన్స్.

26
హీరోయిన్లలో కొంత మందికి మాత్రమే

స్టార్లు సూపర్ స్టార్ల బిరుదులు హీరోలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నాయి. అయితే కొంత మంది స్టార్ హీరోయిన్లకు మాత్రమే రకరకాల ట్యాగ్ లు ఇస్తున్నారు ప్యాన్స్. గతంలో హీరోయిన్ గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నసావిత్రిని మహానటి గా పిలుచుకున్నారు ఫ్యాన్స్. జమునను వెండితెర సత్యభామగా, జయసుధను సహజనటిగా, వాణిశ్రీని కళాభినేత్రిగా, పిలుచుకున్నారు. ఇక ఈకాలం హీరోయిన్ల విషయానికి వస్తే తమన్నాకు మిల్క్ బ్యూటీ అన్న పేరు ఉంది. నయనతారకు లేడీ సూపర్ స్టార్ అన్న పేరు చాలా కాలంగా కొనసాగుతోంది.

36
లేడీ సూపర్ స్టార్

ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈమధ్య కాలంలో తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవద్దు అని ఆమె ఫ్యాన్స్ ను, మీడియాను కోరారు. 40 ఏళ్ల వయస్సులో కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది నయనతా. కమర్షియల్ హీరోయిన్ గా కొననసాగుతున్న టైమ్ లో కూడా నయనతార విమెన్ సెంట్రిక్ మూవీస్ ను చేసి సక్సెస్ సాధించారు. అంతే కాదు ఇండస్ట్రీలో ఫెయిడ్ అవుట్ అయిన హీరోయిన్లు మాత్రమే ఉమెన్ ఓరియెంటెడ్ ట్యాగ్ వేస్తుంటారు . కానీ నయనతార అలా కాదు, కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు.

46
ఫస్ట్ లేడీ సూపర్ స్టార్

నయనతార ప్రస్తుతం డిమాండ్ ఉన్న నటి. చాలా హుందాగా కనిపిస్తుంది. అయితే నయన్ కంటే ముందు టాలీవుడ్ లో ఓ లేడీ సూపర్ స్టార్ ఉన్నారు. ఆమె ఎవరో కాదు విజయశాంతి. తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విజయశాంతి ప్రతిఘటన, వైజయంతి లాంటి సినిమాలతో దుమ్మురేపారు. హీరోలను మించిన క్రేజ్ తో దూసుకుపోయారు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ఘనత విజయశాంతికే దక్కుతుంది. మరీ ముఖ్యంగా విజయశాంతి చేసిన పోలీస్ పాత్రలకు ప్రత్యేకమై ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ లో విజయశాంతి నటించి మెప్పించారు.

56
లేడీ అమితాబ్ గా విజయశాంతి

విజయశాంతి టాలీవుడ్ లో చేసిన పవన్ ఫుల్ పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది. రెమ్యునరేషన్ విషయంలో కూడా విజయశాంతికి డిమాండ్ ఎక్కువగానే ఉండేది. దాంతో టాలీవుడ్ లో ఆమెకు లేడీ అమితాబచ్చన్ అన్న పేరు కూడా వచ్చింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి కమర్షియల్ హీరోలతో ప్రేమగీతాలు పాడిన ఈ హీరోయిన్, ఆతరువాతి కాలంలో తన యాక్షన్ సీన్స్ తో మెస్మరైజ్ చేసి మెప్పించింది. ఇక విజయశాంతి ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఆమెను లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పిలుచుకున్నారు ఫ్యాన్స్.

66
సౌత్ లో లేడీ సూపర్ స్టార్స్ ఎవరెవరు?

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది లేడీ సూపర్స్ ఉన్నారు. గతంలో ఈ బిరుదుతో చాలామంది పాపులర్ అయ్యారు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొంత మంది శ్రీదేవిని ప్రస్తావిస్తుంటారు. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఆమె తన నటనతో, గ్లామర్‌తో, స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇక శ్రీదేవి కంటే ముందు సౌత్ సీనియర్ హీరోయన్ బి. సరోజా దేవిని కన్నడ సినిమా రంగంలో, మొదటి మహిళా సూపర్ స్టార్‌గా పిలుచుకున్నారు. ఇక తాజాగా కూలీ సినిమాలో విలన్ గా నటించిన రచితా రామన్ ను కూడా పిల్మ్ ఇండస్ట్ర కొత్త లేడీ సూపర్ స్టార్ గా పిలుస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories