యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గొప్ప మనసు గురించి అందరికీ తెలుసు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ప్రభాస్ శైలి. 13 ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన ప్రభాస్ వ్యక్తిత్వాన్ని నిదర్శనంగా నిలుస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. బాహుబలి, సలార్, కల్కి లాంటి చిత్రాలు ప్రభాస్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని స్పిరిట్ మూవీ కూడా ప్రారంభం అవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ప్రభాస్ లోని ఓ గొప్ప లక్షణం.
25
ఢీ 5 షోకి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్
13 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో పాపులర్ డ్యాన్స్ షోలలో ఢీ ఒకటి. ఢీ డ్యాన్స్ షోకి స్టార్ హీరోలు అతిథులుగా వెళుతుంటారు. దాదాపు 13 ఏళ్ళ క్రితం ఢీ 5 షో గ్రాండ్ ఫినాలేకి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ షోకి ఉదయభాను హోస్ట్ గా చేశారు. ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే ఉదయభాను మోకాళ్లపై నిలబడి ఫ్లవర్ బొకే ఇవ్వడం హైలైట్. ప్రభాస్ కూడా చిలిపిగా ఆమె దగ్గర నుంచి మోకాళ్లపై నిలబడి బొకే అందుకున్నారు.
35
విజేతగా నిలిచిన శేఖర్ మాస్టర్ టీం
గ్రాండ్ ఫినాలేలో శేఖర్ మాస్టర్ టీం, పోపీ మాస్టర్ టీం తలపడ్డాయి. రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్లుగా డ్యాన్స్ చేసి న్యాయ నిర్ణేతలని, ప్రేక్షకులని మెప్పించాయి. కానీ విజేత ఒక్కరే కాబట్టి జడ్జీలు ఒక టీంని విన్నర్ గా డిసైడ్ చేశారు. విజేతని ప్రకటించడానికి ప్రభాస్ వేదికపైకి వెళ్లారు. శేఖర్ మాస్టర్, పోపీ మాస్టర్ ఇద్దరి చేయిని పట్టుకుని ప్రభాస్ మధ్యలో నిలుచుకున్నారు. కౌంట్ డౌన్ ముగియగానే శేఖర్ మాస్టర్ చేతిని పైకి లేపి ఆయన టీంని విజేతగా అనౌన్స్ చేశారు.
అక్కడే ప్రభాస్ తాను మనసున్న మారాజుని అని నిరూపించుకున్నారు. శేఖర్ మాస్టర్ ని విజేతగా ప్రకటించిన వెంటనే ప్రభాస్ ఆయన చేతిని వదిలేసి.. నిరాశలో ఉన్న పోపీ మాస్టర్ ని ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. తనదైన శైలిలో ప్రభాస్ చిరునవ్వుతో ఆమెకి భరోసా ఇచ్చారు. రన్నరప్ గా నిలిచిన పోపీ మాస్టర్ టీంని ఓదార్చిన తర్వాతే ప్రభాస్ శేఖర్ మాస్టర్ టీం వద్దకు వెళ్లారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
55
ప్రభాస్ తో పాటు మెహర్ రమేష్, తాప్సి
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ గొప్ప మనసుకి ఇదే నిదర్శనం అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ప్రభాస్ తో పాటు ఢీ 5 గ్రాండ్ ఫినాలేకి హీరోయిన్ తాప్సి కూడా అతిథిగా హాజరైంది. ఆ టైంలో ప్రభాస్, తాప్సి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో నటిస్తున్నారు. అదే విధంగా బిల్లా డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా అతిథిగా పాల్గొన్నారు.