చిరంజీవి, బాలకృష్ణతో ఇక లైఫ్‌లో సినిమా చేయను, విజయశాంతి సంచలన స్టేట్‌మెంట్‌.. కారణం ఏంటంటే?

లేడీ అమితాబ్‌ విజయశాంతి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. కమర్షియల్‌ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి మెప్పించింది. స్టార్‌ హీరోలకు దీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో రచ్చ చేసేవంటే ఆమె క్రేజ్‌, రేంజ్‌ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. మళ్లీ చాలా గ్యాప్‌ తర్వాత ఆ మధ్య `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించింది. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ మూవీ `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీలో అమ్మ పాత్ర పోషించింది. 

vijayashanti sensational statement i will not do movies with Chiranjeevi Balakrishna in telugu arj
vijayashanti, chiranjevi, balakrishna

విజయశాంతి తన కెరీర్‌లో వందల చిత్రాల్లో నటించింది. అందులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి నటించింది. అత్యధికంగా వీరి కాంబినేషన్‌లోనే మూవీస్‌ చేసింది, మెప్పించింది. హిట్‌ కాంబినేషన్‌గానూ నిలిచింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసే సమయంలో వారికే పోటీ ఇచ్చింది విజయశాంతి.

అయితే ఆమె లీడ్‌గా మూవీస్‌ చేసే సమయంలో చిరంజీవి, బాలయ్యలతో సినిమాలు చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఆమె మూవీస్‌ చేస్తున్న నేపథ్యంలో చిరు, బాలయ్యలతో సినిమాలు చేసే అవకాశం ఉందా? అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ ప్రశ్నించగా సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది విజయశాంతి. 

vijayashanti sensational statement i will not do movies with Chiranjeevi Balakrishna in telugu arj
vijayashanti

చిరు, బాలకృష్ణలతో మళ్లీ సినిమాలు చేయడం గురించి విజయశాంతి మాట్లాడుతూ, ఇకపై తాను వారితో సినిమాలు చేయనని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తాను మున్ముందు సినిమాలు చేయబోనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యంలో బాధ్యతలు పెరిగాయి. ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉంటాం.

ఇప్పుడు సినిమాలు చేయడానికి కుదరదు అని, అందులోనూ చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు చేసే అవకాశం లేదని, ఇకపై చేయబోనని తెలిపింది. అదే సమయంలో ఇక సినిమాలు కూడా చేయడం కుదరదు అనే విషయం స్పష్టం చేసిందీ లేడీ సూపర్‌ స్టార్‌. 
 


chiranjevi, balakrishna

విజయశాంతి.. చిరంజీవితో కలిసి `గ్యాంగ్‌ లీడర్‌`, `యముడికి మొగుడు`, `స్వయం ఖుషి`, `పసివాడి ప్రాణం`, `కొండవీటి దొంగ`, `కొండవీటి రాజా`, `మెకానిక్‌ అల్లుడు`, `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు`, `మహానగరంలో మాయగాడు`, `స్టూవర్ట్ పురం పోలీస్‌ స్టేషన్‌`, `రుద్రవీణ`, `మంచి దొంగ`, `సంఘర్షణ`, `దేవాంతకుడు`, `చాణక్య శపథం`, `యుద్దభూమి`, `ధైర్యవంతుడు`, `ఛాలెంజ్‌`, `చిరంజీవి`, `ధర్మయుద్దం` వంటి సినిమాల్లో కలిసి నటించారు.

ఇక విజయశాంతి.. బాలయ్యతో కలిసి `రౌడీ ఇన్స్‌పెక్టర్‌`, `లారీ డ్రైవర్‌`, `ముద్దుల మావయ్య`, `నిప్పురవ్వ`, `భార్గవ రాముడు`, `మువ్వ గోపాలుడు`, `అపూర్వ సహోదరులు`, `ముద్దుల కృష్ణయ్య`, `సాహస సామ్రాట్‌`, `భానుమతి గారి మొగుడు`, `ముద్దుల మేనల్లుడు`, `భలే దొంగ`, `ఇన్స్ పెక్టర్‌ ప్రతాప్‌`, `తల్లి తండ్రులు`, `దేశోద్ధారకుడు`, `పట్టాభిషేకం`, `రౌడీ రాణి`, `కథానాయకుడు`, `సంఘర్ష్‌` వంటి సినిమాలు చేశారు. 
 

vijayashanti

ప్రస్తుతం విజయశాంతి నటిస్తున్న `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీలో కళ్యాణ్‌ రామ్‌ హీరో. ఆయనకు తల్లి పాత్రలో ఐపీఎస్‌ వైజయంతిగా విజయశాంతి నటిస్తుంది. తల్లి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌. లా అండ్‌ ఆర్డర్‌ని బాగా కంట్రోల్‌ చేస్తుంది. కానీ కొడుకు గ్యాంగ్‌ స్టర్‌ అవుతాడు.

దీంతో ఇద్దరి మధ్య పోరాటం, తర్వాత తల్లి కోసం కొడుకు మంచిగా ఎలా మారాడు అనేది ఈ మూవీ కథ. తల్లి కొడుకు సెంటిమెంట్‌ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని ఇటీవల ఎన్టీఆర్‌, విజయశాంతి తెలిపారు. రేపు శుక్రవారం(ఏప్రిల్‌ 18)న ఈ మూవీ విడుదల కాబోతుంది. 

read  more: `ఓజీ` సర్‌ప్రైజ్‌ వచ్చేది అప్పుడే.. పవన్‌ కళ్యాణ్‌ కోసం థమన్‌ స్పెషల్‌ ట్రీట్‌ ఏంటంటే?

also read: సిల్క్ స్మితని వాడుకొని వదిలేసిన స్టార్‌ డైరెక్టర్‌.. ఒంటరిని చేసి ఏకంగా సెట్‌లోనే వదిలేసి.. దారుణంగా అవమానం
 

Latest Videos

vuukle one pixel image
click me!