కార్ రేస్‌లో గెలిచాక ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇకపై కార్ రేసింగ్‌పైనే దృష్టి పెడతానని, అక్టోబర్ వరకు ఏ సినిమాలోనూ నటించనని అజిత్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దుబాయ్ కార్ రేస్ తర్వాత ఐరోపా వెళ్లిన అజిత్, అక్కడ జీటీ 4 కార్ రేస్‌లో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. సినిమా రిలీజై సూపర్ హిట్ అయినా, ఆ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకునే తీరిక లేకుండా కార్ రేస్‌లో బిజీగా ఉన్నాడు.