తమిళ చిత్ర పరిశ్రమలో కెప్టెన్ గా పిలవబడే విజయకాంత్ ఆ పేరుకు తగ్గ వ్యక్తిత్వం కలిగిన వారు. నటనతో పాటు విజయవంతమైన నిర్మాత, నటీనటుల సంఘ అధ్యక్షుడు, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. అదేవిధంగా మానవతావాదిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తన వంతు సహాయం చేసిన విజయకాంత్ ఎంతోమంది పేదవారి ఆకలి తీర్చిన పుణ్యాత్ముడు.
ఒకసారి షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి వచ్చి నటి మీనాతో అసభ్యంగా ప్రవర్తించడంతో మీనా రక్షణకు విజయకాంత్ ఏం చేశారో నిర్మాత శివ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
గొప్ప ఆలోచనలో, గొప్ప కార్యక్రమాల కారణంగానే నేడు ఎంతోమంది అభిమానులు విజయకాంత్ ని దేవుడిలా చూస్తారు. గత సంవత్సరం డిసెంబర్ 28న విజయకాంత్ అనారోగ్యంతో మరణించారు. గోవిందపురంలోని ఆయన పార్టీ కార్యాలయం ముందు విజయకాంత్ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ విజయకాంత్ కి స్మారక చిహ్నాన్ని నిర్మించి ఆలయంలా అభిమానులు చూసుకుంటున్నారు.
ఎంతోమంది అభిమానులు ప్రతీరోజూ విజయకాంత్ స్మారక చిహ్నాన్ని సందర్శించి పూజలు చేస్తారు. అదేవిధంగా ప్రతీరోజూ మధ్యాహ్నం ఒక పూట పేదవారికి అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ గురించి ప్రముఖ నిర్మాత టి శివ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
also read: 7 ఏళ్లలో 7 సార్లు రీమేక్, ప్రతి భాషలోనూ సూపర్ హిట్టే!
ఈ ఇంటర్వ్యూలో నక్షత్ర కళా మహోత్సవం సందర్భంగా విజయకాంత్ నటి మీనాను ఒక అనర్థం నుంచి కాపాడారని చెప్పారు. నక్షత్ర కళా మహోత్సవాన్ని విజయకాంత్ ఒక్కరే నిలబడి అన్ని పనులు చేసి ముగించారట.
అప్పుడు మలేషియా నుంచి సింగపూర్ కి వెళ్తున్నప్పుడు వారు బస చేసిన హోటల్ ముందు సెలబ్రిటీలను చూడటానికి వేల మంది జనం గుమిగూడారట. సరైన పోలీసు భద్రత లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది.
ఆ సమయంలో విజయకాంత్, నెపోలియన్, శరత్ కుమార్ నటీమణుల లగేజీలను బస్సులో ఎక్కిస్తున్నారట. హెల్మెట్ ధరించి అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి నటి మీనా దగ్గరకు వచ్చి ఆమెతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడట. ఈ విషయాన్ని విజయకాంత్ గమనించి వేగంగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి హెల్మెట్ తీసి తలకు కొట్టారట. ఆ వ్యక్తి తల పగిలి రక్తం కారిందట.
దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. చాలామంది భయపడి వెనక్కి తగ్గారట. తర్వాత నటీమణులను సురక్షితంగా బస్సులో తీసుకెళ్లారట.అప్పట్లో ఇది హాట్ టాపిక్‌గా మారిందని చెప్పారు నిర్మాత శివ.
read more: జూ ఆర్టిస్ట్ లు కృష్ణంరాజుని బట్టలు చిరిగేలా కొట్టారా? అసిస్టెంట్ కారణం పాపం రెబల్ స్టార్‌కి దారుణమైన అనుభవం