బాలనటుడిగా విజయ్ ఎంట్రీ
తమిళ సినీ పరిశ్రమలో చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన హీరోలో విజయ్ కూడా ఒకరు. బాలనటుడిగా తన సినిమా ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన విజయ్ ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎదుగుతూ.. స్టార్ హీరోగా మారారు. ప్రస్తుతం సినిమా ఒక్కింటికే 200 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న విజయ్, తన సినీ ప్రస్థానాన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభించారు.
విజయ్, తమిళ సినీ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, గాయని శోభ దంపతులకు జన్మించారు. కెమెరా ముందు విజయ్ మొదటిసారి కనిపించిన చిత్రం ‘వెట్రి’, ఇది 1984లో విడుదలైంది. ఈ చిత్రానికి విజయ్ తండ్రే దర్శకత్వం వహించగా, విజయ్ బాలనటుడిగా ప్రధాన పాత్రలో నటించారు.
అంతేకాకుండా, విజయ్ ‘కుట్టం’, ‘నాన్ సిగప్పు మనితన్’, ‘వసంత రాగం’, ‘ఛమ్తా ఒరు వైలత్త’, ‘ఇతు అంక నీతి’ వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు. బాల నటనతో మంచి గుర్తింపు పొందిన విజయ్, ‘నాలియా తీర్‌ప్’ అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి కూడా ఆయన తండ్రే దర్శకత్వం వహించారు.
క్రమంగా విజయ్ హీరోగా తన స్థానం పదిలం చేసుకున్నాడు. 1990ల నుంచి విజయ్ సినిమాలకి భారీగా ఆదరణ పెరిగింది. 2000ల మధ్యకాలంలో విజయ్ బాక్సాఫీస్ విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ఒక్క సినిమాకే 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంతే కాదు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ స్టార్ హీరో తన చివరి సినిమా జననాయకన్ ను హెచ్ వినోద్ డైరెక్షన్ లో నటిస్తున్నారు.