
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా కంటెస్టెంట్లని ఎంపిక చేసే పనిలో బిగ్ బాస్ నిర్వాహకులున్నారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన పనులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎవరు రాబోతున్నారు? ఎలాంటి కంటెస్టెంట్లని దించుతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. గత షోకి పెద్దగా ఆదరణ రాలేదు. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
కానీ ఈ సారి ఆ మిస్టేక్స్ జరగకుండా షో రేటింగ్ పెంచేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి క్రేజీ కంటెస్టెంట్లని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కొందరు కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి.
వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిలో పలువురు క్రేజీ స్టార్స్ ఉండటం విశేషం. అదే సమయంలో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచిన సెలబ్రిటీల పేర్లు కూడా వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం తొమ్మిదో సీజన్‌కి రాబోతున్న కంటెస్టెంట్లు వీరే అని కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో సీరియల్ నటి తేజస్విని, ఇటీవల పబ్‌లో వివాదంతో పాపులర్ అయిన కల్పికా గణేష్, అలాగే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విన్నర్ నిఖిల్ లవర్, సీరియల్ నటి కావ్యలను ఈసారి బిగ్ బాస్ హౌజ్‌కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అలాగే, మరో క్రేజీ ఆర్టిస్ట్ నవ్యసామి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితోపాటు సినిమాల నుంచి `ఛత్రపతి` శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతిరాయ్, సీనియర్ నటుడు సాయికిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియదు.
కానీ బిగ్ బాస్ నిర్వాహకులు పరిగణిస్తున్న పేర్లలో వీరు ఉన్నట్టు సమాచారం. మరోవైపు కొందరు బిగ్ బాస్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారని, అందులో భాగంగానే ఈ లీక్‌లు ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
బిగ్ బాస్ తెలుగు 9లోకి రాబోతున్నది వీరే అని మరికొందరి పేర్లని వైరల్ చేస్తున్నారు. వీరిని బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. వారిలో హీరో కూడా ఉండటం విశేషం.
ఒకప్పుడు యంగ్ హీరోగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు అనే విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. విజయాలు అందుకున్నారు.
కానీ ఇటీవల హీరోగా రాణించలేకపోతున్నారు. చాలా కాలంగా ఆయన్నుంచి సినిమాలు లేవు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ షోకి వస్తే పాపులారిటీ వస్తుందని, జనాల్లోకి వెళ్లొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.
ఆయనతోపాటు ఇటీవల పచ్చళ్ల వ్యాపారం చేస్తూ వివాదాల్లో ఇరుక్కున్న అలేఖ్య చిట్టి కూడా ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఓ కస్టమర్ అలేఖ్య చిట్టి పికిల్స్ రేట్ల గురించి ప్రశ్నిస్తే, దారుణంగా తిడుతూ రిప్లై ఇచ్చారు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్.
దీంతో ఇది పెద్ద రచ్చ అయ్యింది. వీళ్లు ట్రోలింగ్‌కి గురయ్యారు. దీంతో దెబ్బకి ఆన్‌లైన్ యాప్‌ని మూసేశారు. కొన్నాళ్లు బిజినెస్‌ని కూడా క్లోజ్ చేశారు. ఇది కేసుల వరకు వెళ్లిందనే ప్రచారం జరిగింది. కానీ ఈ మొత్తం ఘటనలో అలేఖ్య చిట్టి బాగా పాపులర్ అయ్యింది.
ఆమె చూడ్డానికి అందంగా ఉండటంతో అంతా ఆమెపై ఫోకస్ పెట్టారు. మీడియా కూడా ఆమెని బాగా చూపించింది. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకి లక్కీ ఛాన్స్ వరించిందని, బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిందని సమాచారం.
మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. ఆమెనే బిగ్ బాస్‌కి వస్తే రచ్చ రచ్చే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వీరితోపాటు జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఇమ్మాన్యుయెల్ కూడా రాబోతున్నాడట. ఎంటర్‌టైన్‌మెంట్ కోటాలో ఆయన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ప్రియుడు శివని కూడా ఈ సారి షోకి తీసుకురాబోతున్నారట.
శివ సీరియల్స్ ద్వారా పాపులర్. మరోవైపు బుల్లితెరపై క్రేజీ ఆర్టిస్ట్ గా నిలిచిన దీపికాని కూడా తీసుకురాబోతున్నట్టు సమాచారం. దీపిక చాలాకీతనంతో, కొంటెతనంతో ఆకట్టుకుంటుంది. రచ్చ చేస్తుంది. ఆమె ఈ షోకి వస్తే రచ్చ వేరే లెవల్‌లో ఉంటుందని భావిస్తున్నారు.
వీరితోపాటు సోషల్ మీడియా సెన్సేషన్ రీతూ చౌదరీ పేరు కూడా వినిపిస్తుంది. గ్లామర్ యాంగిల్‌లో ఈమెని దించబోతున్నట్టు సమాచారం.
మరోవైపు మరో బుల్లితెర సెన్సేషన్ దేబ్‌జానీ, టీవీ ఆర్టిస్ట్ సీతా కాంత్, సీనియర్ నటుడు ప్రదీప్, హరికా ఏక్‌నాథ్, మై విలేజ్ షో అనిల్ వంటి వారు పేర్లు వినిపిస్తున్నాయి.
మరి వీరిలో ఎంత మంది ఫైనల్ అవుతారు. ఎంత మంది షోకి వస్తారనేది వేచి చూడాలి. కానీ వినిపిస్తోన్న పేర్లని బట్టి చూస్తుంటే ఈ సారి షో రక్తికట్టించేలా ఉండబోతుందని, కాంట్రవర్సీ, ఎంటర్‌టైన్‌మెంట్, వార్ గట్టిగానే ఉండనుందని అర్థమవుతుంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి. నాగార్జున హోస్ట్ గా రన్ కాబోతున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలోనే స్టార్ట్ కానుందని సమాచారం.