"నా బరువు ఎంత ఉందనే దానికంటే, నేను ఎంత ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాననేది ముఖ్యం. సంఖ్యలపై దృష్టి పెట్టడం కంటే, నా శరీరం ఏం చెబుతుందో దానికి ప్రాధాన్యత ఇస్తాను.
నేను ఉత్సాహంగా, సంతోషంగా ఉంటే అంతే చాలు" అని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో బరువు పెరిగిందని, ఆ తర్వాత ఆరోగ్యం కోసం, సినిమా పాత్రల కోసం బరువు తగ్గానని విజయ్ సేతుపతి తెలిపారు.