మణిరత్నం దర్శకత్వంలో `నాయకుడు` సినిమాలో నటించిన కమల్ హాసన్, 38 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి చేసిన సినిమా `థగ్ లైఫ్`. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు, త్రిష, అభిరామి, అశోక్ సెల్వన్, నాజర్, ఐశ్వర్య లక్ష్మి వంటి పెద్ద తారాగణం నటించింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం. జూన్ 5న ఈ సినిమా విడుదల కానుంది.