చైనాలో 'మహారాజ' షాక్ : 40,000+ థియేటర్స్ లో రిలీజ్ కానున్న విజయ్ సేతుపతి సినిమా

First Published | Nov 29, 2024, 11:18 AM IST

విజయ్ సేతుపతి 'మహారాజ' చైనాలో భారీ విడుదల!  ఈ సూపర్ హిట్ చిత్రం 40,000 స్క్రీన్స్‌లలో ప్రదర్శించబడనుంది.  రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధిస్తుందా?  విజయ్ సేతుపతి నటన, కథా చిత్రం గురించి మరింత తెలుసుకోండి.

Vijay Sethupathis Maharaja china


విజయ్ సేతుపతి సూపర్‌ హిట్‌ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలై ఘన విజయం సాధించింది.

పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు  బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా  ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షోలు పడ్డాయి. స్పెషల్ షోల నుంచే అయిదు కోట్ల దాకా వచ్చాయని సమాచారం. దాంతో  లాంగ్ రన్ లో మహారాజ కొత్త మైలురాళ్ళు సృష్టించడం ఖాయం అని అంటున్నారు.

Maharaja


వాస్తవానికి మహారాజా చిత్రం తమిళంకే పరిమితంగా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే సినిమాలో ఊహించని  ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్‌ సామినాథన్‌ మలవటం కలిసొచ్చింది.  తెలుగులోనూ ఈ సినిమా బాగా ఆడింది. ప్రభాస్ కల్కి సినిమా రాకపోతే ఈ సినిమా రన్ ఇంకా ఉండేది. అయితేనేం ఇప్పుడు జాక్ పాట్ కొట్టింది.

ఇతర దేశాలకు వెళ్తోంది.   ఒక ఇండియన్‌ చిన్న సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో సినీ అభిమానులు ఆనందం మామూలుగా లేదు.  ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం మామూలు విషయం కాదు. లిమిటెడ్  షోలే అయినా మొత్తం హౌస్ ఫుల్స్ కావడం గమనార్హం. ఇవాళ్టి టికెట్ల అమ్మకాలు లక్ష దాటాయట.


maharaja movie


ఆల్రెడీ  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న  యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి.

ఈ మూవీలోని సెంట్‌మెంట్ కు చైనా సినీ అభిమానులు కనెక్ట్‌ అవుతారని భావిస్తున్నారు. అదే జరిగితే  భారీగా కలెక్షన్స్‌ రావడం గ్యారెంటీ .  ఇన్ని థియేటర్స్ లో అక్కడ కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్‌లో సినిమా రన్‌ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేసి చెప్తున్నారు. 

Maharaja

మహారాజా చిత్రం కథ విషయానికి వస్తే ... 

బార్బర్ అయిన  మ‌హారాజా (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బ‌ర్‌. ఒక‌ ప్ర‌మాదంలో భార్య‌ను పోగొట్టుకుని తన కూతురు జ్యోతి తో కలిసి జీవిస్తూంటాడు.  సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తున్న  మ‌హారాజా ఓరోజు ఒంటి నిండా గాయాల‌తో పోలీస్‌స్టేష‌న్ కు వెళ్తాడు.  ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు త‌న ఇంట్లోకి చొర‌బ‌డి త‌న‌పై దాడి చేశార‌ని.. ఈ క్ర‌మంలోనే త‌మ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన ల‌క్ష్మిని ఎత్తుకెళ్లిపోయార‌ని.. ఎలాగైనా స‌రే ఆ ల‌క్ష్మిని వెతికి పెట్ట‌మ‌ని పోలీసుల‌కు కంప్లైంట్ చేస్తాడు.  

ఇంతకీ మ‌హారాజా చెప్పిన ఆ ల‌క్ష్మి ఎవ‌రు?  అతని కంప్లైంట్ ను స్వీక‌రించ‌డానికి పోలీసులు తొలుత ఎందుకు ఒప్పుకోలేదు? అస‌లు మ‌హారాజ‌పై దాడి చేసిన ముగ్గురు వ్య‌క్తులెవ‌రు?వాళ్లకు అత‌నికి ఉన్న విరోధం ఏంటి?  అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాలి.
 

vijay sethupathi starrer Maharaja


ఏముంది సినిమాలో 

అంత‌ర్లీనంగా క‌ర్మ సిద్ధాంతం అనే పాయింట్‌తో ముడిప‌డిన ఈ సినిమా ఓ  భిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. స్టోరీ లైన్ గా చూస్తే రొటీన్ రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగానే క‌నిపిస్తుంది. కానీ, ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లేను మొదటి నుంచి చివరి దాకా ఇంటెన్స్ గా న‌డిపిన తీరు.. విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌ ఈ చిత్రాన్ని స్పెషల్ గా ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి. చాలా  సింపుల్ పాయింట్‌లా కొద్ది పాటి ఫన్ తో  మొద‌లై..  ట్విస్టుల‌తో ఎమోషనల్ గా ముగుస్తుంది. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ లు. సేతుప‌తి యాక్ష‌న్ హంగామా బాగా ఆక‌ట్టుకుంటాయి.

Latest Videos

click me!