విజయ్ 'దళపతి 69': భగవంత్ కేసరి రీమేక్? శ్రీలీల పాత్రలో ఎవరు అంటే

First Published | Nov 29, 2024, 11:13 AM IST

విజయ్ తన తదుపరి చిత్రం 'దళపతి 69' కోసం బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'ని రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు ఈ కమర్షియల్ మరియు సందేశాత్మక చిత్రం సరైన ఎంపిక అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Thalapathy 69, Vijay, bALAKRISHNA, Remake


తమిళ సూపర్  విజయ్ ‘ది గోట్’ సినిమాతో రీసెంట్ గా పలకరించారు. మిక్సెడ్ రివ్యూలు మధ్య ఆ సినిమా యావరేజ్ అనిపించుకుంది. అయితే తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే వచ్చాయని వార్తలు అయితే వచ్చాయి. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు   బాధపడ్డారు. దీంతో  ఆఖరి సినిమా అని చెప్పబడుతున్న  చిత్రం  విషయంలో తనే స్వయంగా దగ్గరుండి  మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్ అని తెలుస్తోంది. 


తనకు  హై సక్సెస్ అయిన  ‘లియో’స్దాయి హిట్ కొట్టాలని విజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో  ‘దళపతి 69’ సినిమా కథ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తుండడం విశేషం.

ఇప్పుడు ఈ సినిమా కథ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయ్యారు. అలాగే మలయాళ నటి మమతా బైజు కూడా ఈ సినిమాలో భాగమైనట్లు తెలుస్తోంది. 



ఇందులో విజయ్‌కి సోదరి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. కాగా దళపతి విజయ్ ఆఖరి సినిమా ఓ తెలుగు సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. అదే మరేదో కాదు.. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. అదే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇబ్బంది పడుతుందని విజయ్ భావించి ఈ సినిమా రీమేక్ చేయబోతున్నారట.
 

తాజా చెన్నై టాక్ ప్రకారం భగవంత్ కేసరి రీమేక్ హక్కులను కెవిఎన్ సంస్థ అఫీషియల్ గా కొనుక్కుందట. ఉన్నది ఉన్నట్లు  తీయకుండా విజయ్ ఇమేజ్ కు అనుగుణంగా దర్శకుడు హెచ్ వినోత్ కొన్ని కీలక మార్పులు చేసినట్టు తెలుగు సిని  వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

శ్రీలీల స్థానంలో మమిత బైజు, కాజల్ అగర్వాల్ ప్లేసులో పూజా హెగ్డే, అర్జున్ రాంపాల్ కు బదులు బాబీ డియోల్ ఇలా క్యాస్టింగ్ లోనే స్పష్టంగా మ్యాటరేంటో అర్థమవుతోందిగా. శరత్ కుమార్ చేసిన క్యామియో కోసం శివరాజ్ కుమార్ ని అడిగి తర్వాత వద్దనుకున్న వినోత్ ఇప్పుడాయన స్థానంలో వేరే ఆర్టిస్టుని తీసుకోబోతున్నారని చెప్పుకుంటున్నారు.


గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ ఓరియంటెడ్ కథతో తెరకెక్కిన భగవంత్ కేసరి నే తనకు సేఫ్ సైడ్ అని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

స్ట్రెయిట్ సబ్జెక్టనుకున్న విజయ్ ఫ్యాన్స్ కి ఇది కొంచెం షాక్ లాంటిదే.‘దళపతి 69’ తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కానున్న సంగతి అందరికీ తెలిసిందే.  అనిరుధ్ రవిచందర్ సంగీతం కాబట్టి ఈ సినిమా నెక్ట్స్ లెవిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.  సినిమా టైటిల్ రివీల్ అయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Latest Videos

click me!