5 ఏళ్లలో 100 సినిమాలు, తన భుజాల వరకు వచ్చే హీరోలతో తన్నులు తినడంపై సుబ్బరాజు కామెంట్స్ 

First Published | Nov 29, 2024, 10:57 AM IST

సుబ్బరాజు టాలీవుడ్ లో మాత్రమే కాదు కోలీవుడ్ లో కూడా నటుడిగా గుర్తింపు పొందారు. క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని సుబ్బరాజు తెలిపారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు 47 ఏళ్ళ వయసొచ్చాక బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. ఎట్టకేలకు సుబ్బరాజు.. స్రవంతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ గా సుబ్బరాజు వివాహం జరిగింది. స్రవంతి ఎన్నారై అని తెలుస్తోంది. చాలా ఏళ్ళ క్రితమే ఆమె కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారట. 

సుబ్బరాజు టాలీవుడ్ లో మాత్రమే కాదు కోలీవుడ్ లో కూడా నటుడిగా గుర్తింపు పొందారు. క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని సుబ్బరాజు తెలిపారు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, ఆర్య రెండు చిత్రాలకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కీలకమైన పాత్రలు రావడం ప్రారంభం అయ్యాయి. 

Also Read : గ్రాండ్ గా శోభిత, నాగ చైతన్య హల్దీ వేడుక..మంగళ స్నానాలతో తడిసి ముద్దైన కొత్త జంట, వైరల్ ఫొటోస్

Latest Videos


దీనితో ఎలాంటి పాత్రలు చేయాలి అనే డైలమా ఉండేది. వెళ్లి పూరి జగన్నాధ్ ని అడిగాను. ఇకపై చిన్న పాత్రలు చేయడం మానేస్తాను అని చెప్పాను. వెంటనే పూరి.. అలా మాత్రం చేయకు. నీకు ఆఫర్ వచ్చిన ప్రతి పాత్ర వదలకుండా చేయి. ఇండస్ట్రీలో అదే కీలకం. ఛాన్సులు వస్తున్నప్పుడు అన్ని పాత్రలు చేయాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు అని పూరి జగన్నాధ్ చెప్పారు. ఆయన మాట ప్రకారం అన్ని పాత్రలు చేసినట్లు సుబ్బరాజు తెలిపారు. 

Also Read : చరణ్, బన్నీ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..ఆ కథ ఓకే అయితే రికార్డులకు పాతరే, ఇద్దరూ అలాంటి పాత్రల్లో

అమ్మానాన్న ఓ తమిళమ్మాయి తర్వాత ఐదేళ్లల్లో 100 సినిమాలు చేశానని సుబ్బరాజు పేర్కొన్నారు. అది నా కెరీర్ లో పీక్ పీరియడ్. యోగి చిత్రంలో కాలు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి కొంచెం స్పీడ్ తగ్గించా అని తెలిపారు. మీరు ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చారు. బాగా చదువుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి కనీసం మీ భుజాల వరకు కూడా హైట్ లేని హీరోలతో తన్నులు తినడం ఇబ్బందిగా అనిపించలేదా అని యాంకర్ ప్రశ్నించారు. 

సుబ్బరాజు సమాధానం ఇస్తూ.. అదంతా వర్క్ లో భాగం, నేను ఎప్పుడూ అలా ఫీల్ అవలేదు. నాకిచ్చిన క్యారెక్టర్ ప్రకారం హీరోతో ఫైట్ చేయడం నా డ్యూటీ అని సుబ్బరాజు తెలిపారు. కాకపోతే కొన్ని చిత్ర పాత్రలు వస్తాయి.. అవి చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాడిని. వచ్చి ఒక డైలాగ్, ఒక ఫైట్ చేసి వెళ్లిపొమ్మని అడుగుతారు. అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అడిగితే కాదనలేం అని సుబ్బరాజు తెలిపారు. కొందరు నిర్మాతలు రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని సుబ్బరాజు అన్నారు. 

click me!