టాలీవుడ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి, పాన్ ఇండియా హీరోతో తలపడబోతున్న మక్కల్ సెల్వన్

మరోసారి టాలీవుడ్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు విజయ్ సేతుపతి. పాన్ ఇండియా హీరోతో తలపడబోతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలో భాగం కాబోతున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఏంటా సినిమా? 

Vijay Sethupathi Potential Villain Role in Prabhas Film in telugu jms

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు విజయ్ సేతుపతి.  హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్ర ఇచ్చినా అదరగొట్టేస్తున్నాడు. తమిళంతో పాటు  తెలుగు, హిందీ మలయాళం ఇలా చాలా భాషల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు విజయ్ సేతుపతి. రీసెంట్ గా  షారుఖ్ ఖాన్ కి విలన్ గా జవాన్ సినిమాలో నటించి రూ.1000 కోట్లు కొల్లగొట్టాడు.

Also Read:  రజినీకాంత్ ను ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్, పెళ్ళి మాత్రం చేసుకోలేకపోయింది? ఎవరో తెలుసా?

Vijay Sethupathi Potential Villain Role in Prabhas Film in telugu jms
విజయ్ సేతుపతి

జవాన్ తర్వాత విలన్ అవకాశాలు బాగా రావడంతో, తన హీరో ఇమేజ్ పోతుందని కొన్ని సినిమాలు వదులుకున్నాడు విజయ్ సేతుపతి. హీరోగా చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో, నితిలన్ డైరెక్షన్ లో వచ్చిన మహారాజా సినిమాతో మంచి  పాత్రలో నటించి హిట్ కొట్టాడు. ఈ సినిమాకి ఇండియాలోనే కాదు చైనాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read:  1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?


ప్రభాస్ స్పిరిట్ మూవీ

మహారాజా హిట్ తర్వాత ఏస్ అనే సినిమాలో నటించాడు విజయ్ సేతుపతి. ఇది కాకుండా డైరెక్టర్ పాండిరాజ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా హీరోగా వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతికి మళ్ళీ విలన్ గా అవకాశం వచ్చింది. అది కూడా టాలీవుడ్ నుంచి తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలో .

Also Read:  5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?

సందీప్ వంగా స్పిరిట్ మూవీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట విజయ్. ఆసినిమా ఏదో కాదు  స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి హిట్  సినిమాలు తెరకెక్కించిన టాలీవుడ్  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో  ప్రభాస్ కి విలన్ గా విజయ్ సేతుపతితో మాట్లాడుతున్నారట. విలన్ గా చేయకూడదు అనుకుంటున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓకే చెబుతాడో లేదో చూడాలి.

Also Read: 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Latest Videos

vuukle one pixel image
click me!