Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ సాధారణ బస్ కండెక్టర్, ఎన్నో కష్టాలుపడి హీరోగా మారాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, స్టార్ హీరోగా మారాడు. తమిళ సినిమా రారాజుగా ఉన్నారు. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు తలైవా. 74 ఏళ్ళ వయస్సులో కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్.
Also Read: 1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?
Rajinikanth, Sridevi Love Story
ఈ ఏజ్ లో కూడా రజినీకాంత్ స్టైల్ కాని, ఫిట్ నెస్ కాని ఏమాత్రం తగ్గలేదు. ఒకప్పుడు ఆయన వాకింగ్ స్టైల్, సిగెరెట్ తాగే స్టైల్ చూసి లేడీ ఫ్యాన్స్ పిచ్చిగ ప్రేమించేవారు. కామన్ ఆడిన్స్, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా ఆయన్ను ప్రేమించేవారు. అభిమానించే వారు. కొంత మంది అయితే ఆరాధించేవారు. ఈక్రమంలో రజినీకాంత్ ను చాలా ఇష్టపడిందట ఓ స్టార్ హీరోయిన్. ఆయన కూడా ఆమెను ప్రేమించారని తెలుస్తోంది.
Also Read:5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?
Rajinikanth, Sridevi Love Story
అయితే ఈ ప్రేమ పెళ్లిదాకా మాత్రం వెళ్ళలేదట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు శ్రీదేవి. అవును శ్రీదేవికి రజినీకాంత్ అంటే చాలా ఇష్టమట. రజినీకాంత్ కూడా శ్రీదేవిని ఇష్టపడ్డారట. సౌత్ లో స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఒక ఊపు ఊపేస్తున్న టైమ్ లో.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తారు. బాక్సాఫీస్ దగ్గర రజినీ సినిమాలు వీర విహారం చేశాయి. ఆ టైమ్ లోనే ఇద్దరు ప్రేమలో పడ్డట్టు పుకార్లు షికారు చేశాయి.
Rajinikanth and Sridevi
రజినీకాంత్ కూడా శ్రీదేవి అమ్మగారితోచాలా క్లోజ్ గా ఉండేవారట. కాని వీరి పెళ్లి మాత్రం జరగలేదు. శ్రీదేవికి బాలీవుడ్ లో అవకాశాలు పెరగడం, రజినీకాంత్ కు అప్పటికే లతతో వివాహం జరగడం అన్ని అనుకోకుండా జరిగిపోయాయి. బాలీవుడ్ కు వెళ్ళిన శ్రీదేవి.. సౌత్ వైపు ఎక్కువగా చూడలేదు. అక్కడ ఆడియన్స్ ఆమెకు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఊపిరి మెసలలేనంత బిజీ అయిపోయింది. ఆ టైమ్ లోనే బోనీ కపూర్ శ్రీదేవి తో ప్రేమలో పడ్డారు. ఆమెను కూడా పడేశారు.
Rajinikanth and Sridevi
ఇక శ్రీదేవి తల్లితో కూడా బోనీకపూర్ కు మంచి స్నేహం ఉండటం, శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి బోనీకపూర్ కు కలిసి వచ్చింది. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం, రకరకాల కారణాలతో శ్రీదేవి పెళ్ళి హడావిడిగా జరిగిపరోయినట్టు తెలుస్తోంది. అంతే కాదు పెళ్ళి కాకముందే శ్రీదేవి గర్భవతి అని తెలుస్తోంది. జాన్వీ కపూర్ కడుపులో ఉండగానే వీరి పెళ్లి జరిగింది. అయితే బోనీ కపూర్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే శ్రీదేవి తల్లి బోనీ కపూర్ కి ఇచ్చి పెళ్లి చేశారు.
Rajinikanth and Sridevi
అటు రజినీకాంత్ కూడా తన ప్రేమను త్యాగం చేసి కాల క్రమంలో మర్చిపోయారట. వీరిద్దరు సినిమాలు చేసేప్పుడు మాత్రం రకరకాల పుకార్లు వచ్చినట్టు సమాచారం. లతను పెళ్ళాడిన రజినీకాంత్ ఆతరువాత శ్రీదేవిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వదంతులు కూడా పుట్టాయి. కాని అవేవి నిజం అవ్వలేదు. శ్రీదేవి తన పెళ్లి జీవితాన్ని హ్యాపీగా గడిపింది. 54 ఏళ్ళ వయస్సులో అనుమానస్పద పరిస్థితుల్లో శ్రీదేవి మరణించింది. ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీనే.