సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తనను వెంటాడుతున్న సమస్యల గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. చూసి భయపడకుండా, దానితో జీవించడం నేర్చుకున్నానని షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో స్టార్ నటుడుగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. హీరో ఇమేజ్‌కే పరిమితం కాకుండా, సవాలుతో కూడిన పాత్రల్లోచేస్తున్నాడు. ఆయన నటించిన చివరి సినిమా 'తలైవన్ తలైవి'. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు 100 కోట్లు వసూలు చేసింది.
24
బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతికి డిఫరెంట్ జానర్స్ లో .. రకరకాల పాత్రలకు వరుస అవకాశాలు వస్తున్నాయి. రజినీకాంత్ 173వ సినిమాలో, అజిత్ తర్వాతి సినిమాలో విలన్‌గా నటించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రాలేదు. నటనతో పాటు, బిగ్‌బాస్ సీజన్ 9కి హోస్ట్‌గా బిజీగా ఉన్నారు విజయ్.
34
బిగ్ బాస్ పై తన మార్క్ చూపిస్తోన్న విజయ్
బిగ్ బాస్ లో తన మార్క్ చూపిస్తున్నాడు మక్కల్ సెల్వన్. కమల్ హాసన్ లాగా చుట్టి చుట్టి మాట్లాడకుండా, కంటెస్టెంట్లను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకే బిగ్‌బాస్ ఫ్యాన్స్ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. విజయ్ సేతుపతి వచ్చే ఆ రెండు రోజులు తప్పకుండా చూస్తున్నారు.
రీసెంట్ గా బిగ్‌బాస్ షోలో విజయ్ సేతుపతి తన ఆర్థిక సమస్యపై మాట్లాడారు. ఆర్ధిక సమస్యలు ఏ స్థాయిలో ఉన్నా.. ఎవరికైనా తప్పవన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. "వేలల్లో సంపాదించినా, కోట్లలో సంపాదించినా అప్పులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే దానితో జీవించడం నేర్చుకున్నా. వాటి గురించి ఆలోచించి భయపడితే.. జీవితం ముందుకు సాగదు అని " అని విజయ్ అన్నారు. బిగ్ బాస్ లో ఓ కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా విజయ్ సేతుపతికి అప్పులేంటి అని.. అంతా ఆశ్చర్చపోతున్నారు.