కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: బిగ్ ట్విస్ట్- కొత్త సీఈఓగా శ్రీధర్- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న జ్యో

Published : Nov 12, 2025, 07:50 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 12వ తేదీ)లో కొత్త సీఈఓ అనగానే ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. సీఈఓ కావాలంటే రెండు పెళ్లిళ్లు చేసుకోవాలా? అంటుంది జ్యో. గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటుంది జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

PREV
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో దీప సీఈఓ పోస్ట్ వద్దు అనగానే వెళ్లాల్సిన మనిషికి మెసేజ్ వెళ్లింది అంటాడు శివన్నారాయణ. ఎవరా మనిషి అని అడుగుతుంది జ్యోత్స్న. ఇంతలో ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. కొత్త సీఈఓ మామయ్యనా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అల్లుడు ఇది నువ్వేనా అని అడుగుతుంది పారు. నేనే అత్తయ్య గారు అంటాడు శ్రీధర్. కూర్చో శ్రీధర్ అంటాడు శివన్నారాయణ. చిన్న స్మైల్ ఇస్తాడు కార్తీక్. కొత్త సీఈఓ ఎవరు అని మరోసారి అడుగుతుంది జ్యోత్స్న.

27
రెండు పెళ్లిళ్లు చేసుకోవడమే అర్హతా?

ఎదురుగా మనిషిని పెట్టుకొని ఎవరూ అని అడుగుతావేంటి అంటాడు శివన్నారాయణ. సీఈఓ కావడానికి మామయ్యకు ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. శ్రీధర్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్. తను ఈ కంపెనీని సమర్థవంతంగా చూసుకోగలడు అంటాడు శివన్నారాయణ. ఈ కంపెనీకి సీఈఓ కావాలంటే రెండేసి పెళ్లిళ్లు చేసుకోవాలన్న మాట అంటుంది జ్యోత్స్న. కోపంతో గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. ఈ మాట వేరే వాళ్లు అనుంటే మాటలతో కాదు చేయితో సమాధానం చెప్పేవాడిని అంటాడు. ఆ మాటకు వెనక్కి తగ్గుతుంది జ్యోత్న్స.

37
కొత్త సీఈఓ శ్రీధర్..

సీఈఓగా శ్రీధర్ ని ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్తాడు శివన్నారాయణ. కార్తీక్ ని ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమిస్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు అని బోర్డు మెంబర్స్ ని అడుగుతాడు. శ్రీధర్ కార్తీక్ సార్ తండ్రి. పైగా కార్తీక్ సార్ కూడా మనతోనే ఉంటారు. కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటారు బోర్డ్ మెంబర్స్. అయితే మనం మరో రెండు రోజుల్లో మళ్లీ మీటింగ్ పెట్టుకొని కొత్త సీఈఓ ఆధ్వర్యంలో కంపెనీని ఎలా అభివృద్ధి చేయాలో మాట్లాడుకుందాం అంటాడు శివన్నారాయణ. అందరూ ఒక్కొక్కరిగా శ్రీధర్ కి కాంగ్రాట్స్ చెప్తారు. తర్వాత మేము ఇక బయల్దేరుతాం అని చెప్పి వెళ్లిపోతారు బోర్డ్ మెంబర్స్. దీప, సుమిత్ర, పారు కూడా వెళ్తారు. జ్యోత్స్న మాత్రం ఇక్కడ నాకు ఇంకా పనిలేదు అని కోపంగా బయటకు వెళ్తుంది.

47
కత్తిని చూసిన శివన్నారాయణ

పారు తీసుకొచ్చిన కత్తిని చూస్తాడు శివన్నారాయణ. దాన్ని కార్తీక్ ని తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోమంటాడు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. తర్వాత శ్రీధర్ ని తన క్యాబిన్ లోకి తీసుకెళ్తాడు శివన్నారాయణ. సీఈఓ చైర్ లో కూర్చొబెట్టి కాంగ్రాట్స్ చెప్తాడు. సంతోషంగా థాంక్స్ చెప్తాడు శ్రీధర్. నిజంగా నేను దీనికి అర్హుడినేనా అడుగుతాడు. నువ్వు కార్తీక్ తండ్రివి. అంతకు మించిన అర్హత మరొకటి లేదు అని చెప్తాడు శివన్నారాయణ. 

మామయ్య గారు నాదొక రిక్వెస్ట్. జ్యోత్స్న కూడా ఏదో ఒక పొజిషన్ లో ఈ కంపెనీలో ఉండేలా చూడండి అని చెప్తాడు శ్రీధర్. ఒకే.. ఆ విషయం నువ్వే తనతో చెప్పు అంటాడు శివన్నారాయణ. నువ్వు మీ నాన్నతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు. నేను బయట ఉంటాను అని చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ.

57
మనమంతా ఒక్కటే

కార్తీక్ కి థాంక్స్ చెప్తాడు శ్రీధర్. మనమంతా ఒక్కటే మాస్టారు అంటాడు కార్తీక్. నేను మీకు అన్యాయం చేశాను. కానీ ఏ రోజు నువ్వు నన్ను దూరం పెట్టలేదు. తండ్రిగా నన్ను ప్రేమించావు. గెలిపించావు. మామయ్య గారు అన్నట్లు కార్తీక్ తండ్రిగా మాత్రమే శ్రీధర్ ఉన్నాడు అని ఎమోషనల్ అవుతాడు శ్రీధర్. మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి మాస్టారు అంటాడు కార్తీక్. 

కలిసి ఉండాలి అంటే నేను మీతో ఉండొచ్చా? మీ అమ్మ నన్ను క్షమిస్తుందా? అని అడుగుతాడు శ్రీధర్. మౌనంగా ఉంటాడు కార్తీక్. నేను ఈ రోజు కాంచనాతో భోజనం చేశాను కార్తీక్ అంటాడు శ్రీధర్. నువ్వు ఇందాక శ్రీధర్.. కార్తీక్ తండ్రి మాత్రమే అన్నట్లు మా అమ్మ కూడా అనుకుంటోంది మాస్టారు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. మా అమ్మ నిన్ను భర్తగా ఒప్పుకోదు అని ఎంత బాగా చెప్పావో.. కానీ నేనే కాంచన క్షమిస్తుందనే చిన్న ఆశతో ఉన్నాను అని మనసులో అనుకుంటాడు శ్రీధర్.

67
కత్తిని ఆఫీసుకి ఎందుకు తీసుకొచ్చావ్?

ఈ కత్తిని ఆఫీసుకి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అని అడుగుతాడు శివన్నారాయణ. ముసలోడికి ఇలా దొరికిపోయానేంటి అని లోలోపల అనుకుంటుంది పారు. మా ఆవిడని వేసేయడానికే తెచ్చావు కదా పారు అని చిన్నగా అంటాడు కార్తీక్. ఈ మాట మీ తాత వింటే నిజమే అనుకుంటాడు నువ్వు ఊరుకోరా అంటుంది పారు. ఎందుకు తెచ్చావో చెప్పమంటే మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారేంటి అని అడుగుతాడు శివన్నారాయణ. 

ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి తెచ్చాను అంటుంది పారు. మరి ఫ్రూట్స్ ఏవి అని అడుగుతాడు కార్తీక్. మర్చిపోయాను అంటుంది పారు. కిచెన్ లో ఉన్న కత్తి ఆఫీసుకి వచ్చింది కానీ.. ఫ్రిజ్ లో ఉన్న ఫ్రూట్స్ రాలేదు. బాగానే కవర్ చేస్తున్నావు పారు అంటాడు కార్తీక్. ఇంతలో లగేజ్ బ్యాగ్ తో వచ్చి ఆ కత్తిని తీసుకుంటుంది జ్యోత్స్న. ఒకపక్క జీవితాలే తలకిందులు అవుతుంటే ఈ కత్తి కోసం గొడవపడుతున్నారా అని దాన్ని పక్కకు పడేస్తుంది.

77
నిజమా? లేక నాటకమా?

ఆ బ్యాగ్ ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది పారు. టీపాయ్ మీద ఉన్న ఓ ఫ్లవర్ పాట్ ను పగలగొట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను అని చెప్తుంది జ్యోత్స్న. షాక్ అవుతారు అంతా. ఈ ఇంట్లో నాకు ఎవ్వరూ లేరు. నా ఫ్రెండ్స్ వేరే దేశంలో ఉన్నారు. నేను కూడా అక్కడికే వెళ్లిపోతాను అంటుంది జ్యోత్స్న. మేమంతా ఎవరు మరి అంటాడు దశరథ. నువ్వు ఆఫీసులో దీపకు సపోర్ట్ చేశావా? నాకు సపోర్ట్ చేశావా? అంటుంది జ్యోత్స్న. 

ఆఫీసు విషయాలు, పర్సనల్ విషయాలు కలపకూడదని మా నాన్న ఎన్నోసార్లు చెప్పారు అంటాడు దశరథ. కన్న తండ్రివి నువ్వే నన్ను సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఒకప్పుడు నాకేదైనా కావాలంటే అడగడానికి ఈ ఇంట్లో నలుగురు ఉండేవారు. ఇప్పుడు నేను అడిగినా ఇచ్చేవారు లేరు. అసలు నాకెవ్వరూ లేరు. ఓ పనిమనిషికి ఉన్న విలువ కూడా నాకు లేదు అంటుంది జ్యోత్స్న. ఇది నిజంగా వెళ్లిపోతా అంటుందా? లేక నాటకం ఆడుతోందా? అని మనసులో అనుకుంటుంది పారు.

ఇంతలో అక్కడికి వస్తాడు శ్రీధర్. రండి మామయ్య నీకు స్వాగత సత్కారాలు పలకడానికి ఇక్కడ వీళ్లంతా సిద్ధంగా ఉన్నారని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. నా తండ్రిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు జ్యోత్స్న అంటాడు కార్తీక్. నేను ఇక్కడికి సత్కారాల కోసం రాలేదు. మీ ప్రేమ కోసం మాత్రమే వచ్చాను అంటాడు శ్రీధర్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories