సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ప్రమాదం జరిగింది. షూటింగ్‌లో ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన గాయపడినట్టు సమాచారం. విజయ్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడు, అభిమానులు 'మక్కల్ సెల్వన్' అని పిలుచుకునే విజయ్ సేతుపతి, షూటింగ్ సెట్‌లో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారన్న వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
26
ఫైట్ సీన్‌లో ప్రమాదం
సహజ నటనతో గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి, పలు భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ సినిమా ఫైట్ సీన్ షూటింగ్‌లో అనుకోకుండా ఆయన గాయపడ్డారు. డూప్ లేకుండా నటించడంతో ఆయనకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం.
36
ఆసుపత్రిలో విజయ్ సేతుపతి..
గాయపడగానే చిత్ర బృందం ప్రథమ చికిత్స చేసి దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రికి వెళ్లారు.
ఈరోజే విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్' రిలీజైంది. ఆయన అభిమానులు సంబరాల్లో ఉండగా, ఆయన ప్రమాద వార్త వైరల్ అయింది. దీంతో షాకైన అభిమానులు, "త్వరగా కోలుకో అన్నా", "Get Well Soon Makkal Selvan" అంటూ ప్రార్థిస్తున్నారు.
56
ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి
ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయన గాయాలు ప్రాణాంతకం కావు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విజయ్ క్షేమంగా ఉన్నారు. అయితే, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.
66
వదంతులు నమ్మవద్దు.
దీనిపై అధికారిక ప్రకటన ఆయన మేనేజర్ లేదా చిత్ర బృందం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మవద్దని అభిమానులను కోరుతున్నారు.