Devagudi Movie Review: దేవగుడి మూవీ రివ్యూ.. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?

Published : Jan 30, 2026, 04:35 PM ISTUpdated : Jan 30, 2026, 05:10 PM IST

బెల్లం రామకృష్ణారెడ్డి అన్నీ తానై రూపొందించిన చిత్రం `దేవగుడి`. ఫ్యాక్షన్‌ నేపథ్య కథతో రూపొందిన ఈ మూవీ శుక్రవాం విడుదలయ్యింది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? 

PREV
16
దేవగుడి మూవీ రివ్యూ

ఫ్యాక్షన్‌ నేపథ్యంతో కూడిన సినిమాలు వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. అడపాదడపా మధ్యలో ఒకటి అర సినిమాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఇప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్‌ కథతో `దేవగుడి` చిత్రం రూపొందింది. ఇందులో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించారు. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నేడు శుక్రవారం(జనవరి 30న) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

26
దేవగుడి మూవీ కథ

రాయలసీమలోని దేవగుడి అనే ఊర్లో వీరారెడ్డి(రఘు కుంచె) పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఊరి జనం మాత్రం ఆయన్ని దేవుడిలా చూసుకుంటారు. ఆయనకు ఇద్దరు పిల్లలు రాఘవ రెడ్డి(నరసింహ)`, శ్వేతా రెడ్డి(అను శ్రీ). వీరికి తక్కువ కులానికి చెందిన ధర్మ(అభినవ్‌ శౌర్య) మంచి స్నేహితుడు. చిన్నప్పట్నుంచి కలిసే పెరుగుతారు. ధర్మది తక్కువ కులం అయినా వీరారెడ్డికి నమ్మిన బంటులా ఉంటారు. అయితే శ్వేత ధర్మపై మనసు పడుతుంది. ధర్మ స్నేహానికి వీరారెడ్డి కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఒకటి రెండు సార్లు వీరారెడ్డిపై ఎటాక్‌ జరిగినా కూడా ధర్మనే ముందుండి ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు. చావు నుంచి కాపాడతాడు. శ్వేతకి ధర్మపై ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక రోజు రాత్రి ధర్మపై తన ప్రేమని వ్యక్తం చేస్తుంది. పుట్టిన రోజు సందర్బంగా ఒంటరిగా రూమ్‌లో ఉన్నప్పుడు అతన్ని హగ్‌ చేసుకుంటుంది. అప్పుడే రాఘవరెడ్డి రావడంతో ధర్మ పారిపోతాడు. నమ్మి చేరదీస్తే ఇంత మోసం చేస్తారా అని రాఘవకి, వీరా రెడ్డికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ధర్మని చంపాలనుకుంటారు. కానీ శ్వేత అమ్మ అడ్డుకుంటుంది. దీంతో అప్పట్నుంచి ఊరిని వదిలి అడవిలోకి వెళ్లిపోతాడు ధర్మ. మరి ధర్మ దూరం కావడంతో శ్వేత ఏం చేసింది? ప్రేమ కోసం ఎలాంటి యుద్ధం చేసింది? స్నేహితుడి గురించి రాఘవకి తెలిసిన నిజం ఏంటి? చెల్లి కోసం, స్నేహితుడి కోసం ఆయన ఏం చేశాడు? మరి ధర్మ, శ్వేత కలిశాడా? దూరమయ్యారా? ఈ కథ ఎలాంటి ముగింపు తీసుకుందనేది మిగిలిన సినిమా.

36
దేవగుడి విశ్లేషణ

రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఇరవై ఏళ్ల క్రితం చాలా సినిమాలు వచ్చాయి. చాలా వరకు విజయాలు సాధించాయి. ఒక ట్రెండ్‌లాగా తెరకెక్కడం విశేషం. ఆ తర్వాత ట్రెండ్‌ పోయింది. మళ్లీ అలాంటి రోజులను గుర్తు చేస్తూ, అలాంటి సినిమాలను గుర్తు చేస్తూ వచ్చిన చిత్రమే `దేవగుడి`. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో ఓ వైపు ఫ్యాక్షన్‌ కథ, మరోవైపు లవ్‌ స్టోరీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. దీనికి కులహత్యలు అనే కాన్సెప్ట్ ని జోడించి తీరు బాగుంది. ఈ అంశం నేటి ట్రెండ్‌కి కూడా కనెక్ట్ అయ్యేలా ఉండటం విశేషం. ఇదే `దేవగుడి` సినిమాలో స్పెషల్‌. కథగా చూసినప్పుడు ఇది రొటీన్‌ స్టోరీనే. `యజ్ఞం` మూవీకి దగ్గరగా ఉన్న ఫీలింగ్‌ తెప్పిస్తుంది. తక్కువ కులం ఉన్న కుటుంబం పెద్ద ఫ్యామిలీ వద్ద పనిచేయడం, పెద్దాయన్ని రక్షించేందుకు పనిచేస్తుంటారు. ఇది కూడా అలానే సాగుతుంది. హీరో వీరారెడ్డి కొడుకు, కూతురు ముగ్గురూ చిన్నప్పట్నుంచి కలిసే పెరుగుతారు. కానీ హీరోని తక్కువ చూడటమనేది చిన్నప్పట్నుంచి జరుగుతుంది. ధర్మలోని ధైర్యసాహసాలను చూసి హీరోయిన్‌ ప్రేమించడం, ఆయన్ని కోరుకోవడం, ఆమె తనని ప్రేమిస్తున్నా తన ప్రేమని ధర్మ తనలోనే దాచుకోవడం అనేది రెగ్యూలర్‌గానే ఉంటుంది. కాకపోతే అది ఎంగేజింగ్‌గా తీసుకెళ్లారు దర్శకుడు. చూస్తున్నంత సేపు చాలా సినిమాలు గుర్తుకు వస్తున్నా, స్క్రీన్‌ప్లేతో ఎంగేజ్‌ చేసే ప్రయత్నం చేశారు. దీనికితోడు మంచి బీజీఎం కుదిరింది. ఎమోషనల్‌ సీన్లలు, ఊరి పండగ సన్నివేశాల్లో ఊపు తెచ్చే పాటలతో అలరించారు. ఫ్యాక్షన్‌కి సంబంధించిన అంశాలను సీరియస్‌గా చూపించి ఉత్కంఠకి గురి చేశారు. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. ఊరి పండగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అందులో వచ్చే యక్షన్‌ సీన్స్ గూస్‌ బంమ్స్ తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో హీరో ఊరి నుంచి వెళ్లిపోవడం, హీరోయిన్‌ అతని కోసం వేచి చూస్తుండటం, తప్పు తెలుసుకున్న రాఘవరెడ్డి స్నేహితుడికి హెల్ప్ చేయాలనుకోవడం, అందుకు తన తండ్రిని ఒప్పించే ప్రయత్నం, మరోవైపు తన చెల్లిని, ఫ్రెండ్‌ని కలిపే చేసే ప్రయత్నాలు ఆద్యంతం నాటకీయంగా సాగుతాయి. ప్రేమ వల్ల ఒక కుటుంబం ఎలా చిన్నాభిన్నం అవుతుందని చూపించే సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయి. క్లైమాక్స్ కులహత్యలను తలపిస్తుంది. దాని ఫలితాలు ఎంతటి భయంకరంగా ఉంటయనేది చూపించిన తీరు బాగుంది. సినిమా మొత్తాన్ని ఒక పాట నడిపిస్తుంది. ఎమోషనల్‌ సీన్లని ఆవిష్కరించేలా వచ్చే ఆ పాట గుండెని టచ్‌ చేస్తుంది.

46
దేవగుడి మూవీలో ప్లస్‌, మైనస్‌లు

సినిమాలో ఎమోషనల్‌ సీన్లు, లవ్‌ ట్రాక్‌ బాగున్నాయి. యాక్షన్‌ సీన్లు కూడా బాగున్నాయి. ప్రేమ కోసం హీరోయిన్‌ చేసే సాహసం ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్లు మెప్పిస్తాయి. సెకండాఫ్‌ ఆద్యంతం నాటకీయంగా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఆయా సీన్లు ఎంగేజ్‌ చేస్తాయి. కాకపోతే స్టోరీ కొత్తగా లేకపోవడంతో రొటీన్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో, సెకండాఫ్‌లో చాలా సీన్లని సాగదీశారు. క్లైమాక్స్  ఎమోషనల్‌గా  గుండెని కదిలిస్తుంది.  

56
దేవగుడి మూవీ ఆర్టిస్ట్ ల పనితీరు

ధర్మ పాత్రలో అభినవ్‌ శౌర్య బాగా నటించాడు. కొత్త కుర్రాడు అయినా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రాఘవ పాత్రలో నరసింహ ఉన్నంతలో మెప్పించాడు. సెటిల్డ్ గా నటించాడు. శ్వేత పాత్రలో అనుశ్రీ చాలా బాగా చేసింది. రొమాంటిక్‌ సాంగ్‌లో రెచ్చిపోయింది. ఆమెలోని యాక్షన్‌ వాహ్‌ అనేలా ఉంటుంది. ఆమె పాత్ర చాలా బలంగా ఉంది. ఇక వీరారెడ్డిగా రఘుకుంచె పవర్‌ఫుల్‌ రోల్‌ చేశాడు. అదరగొట్టాడు. తన కెరీర్‌ పరంగా ఇది మరో చెప్పుకునే పాత్ర అవుతుంది. ఫ్యాక్షనిస్ట్ గా పాత్రలో జీవించాడు. లక్ష్మన్‌ పాత్ర సైతం ఆకట్టుకుంటుంది. రఘుబాబు, రాకెట్‌ రాఘవతోపాటు మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.

66
దేవగుడి టెక్నీషియన్ల పనితీరు

టెక్నీకల్‌గా చూస్తే.. ఈ మూవీకి మ్యూజిక్‌ పెద్ద అసెట్‌. మదీన్‌ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. `అరెరో` అనే పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాని అలా తీసుకెళ్లిపోతుంది. మిగిలిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమా స్థాయిలో ఉన్నాయి. బీజీఎం అదిరిపోయింది. కెమెరా వర్క్ ఫర్వాలేదు. ఎడిటింగ్‌ పరంగా కేర్‌ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. రిచ్‌గా ఉంది. దర్శకుడు రామకృష్ణారెడ్డి మరోసారి ఫ్యాక్షన్‌ కథని చెప్పే ప్రయత్నం బాగుంది.  స్క్రీన్‌ ప్లే పరంగా మ్యాజిక్‌ చేశారు.   ప్రేమ, స్నేహాన్ని, ఫ్యాక్షన్‌ని బాగా బ్యాలెన్స్ చేశారు. ఈ మూడింటిని కలిపే క్రమంలో పుట్టే నాటకీయతని కూడా బాగా ఆవిష్కరించారు.  కుల హత్యలకు సంబంధించిన సందేశం బాగుంది.

ఫైనల్‌గా: ఫ్యాక్షన్‌ నేపథ్య ప్రేమ కథలను ఇష్టపడేవారికి బాగా నచ్చే మూవీ. జస్ట్ టైమ్‌ పాస్‌ మూవీ.

రేటింగ్‌: 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories