విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సార్ మేడమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది, కథ ఏంటి లాంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు హీరోయిన్ నిత్యామీనన్ కూడా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వీళ్ళిద్దరూ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సార్ మేడమ్( తమిళంలో తలైవన్ తలైవి). జూలై 25న తమిళంలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
25
90 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన మూవీ
తెలుగులో ఈ చిత్రం సార్ మేడమ్ టైటిల్ తో రిలీజ్ అయింది. నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువచ్చారు. ఆగష్టు 22 నుంచి సార్ మేడమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలైంది. తమిళంలో థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ ఏకంగా బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు పాండిరాజ్ ఈ చిత్రాన్ని నేచురల్ పెర్ఫార్మెన్స్ లతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు.
35
కథ ఏంటంటే
ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అంటే విజయ్ సేతుపతి, నిత్యామీనన్ భార్యాభర్తలుగా అందించిన పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. వీళ్లిద్దరి నటన, సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫీస్ట్ లా ఉంటాయి. కథ విషయానికి వస్తే.. హీరో తన ఊర్లో హోటల్ నడిపే వ్యక్తి. విజయ్ సేతుపతికి ఒకసారి నిత్యామీనన్ తో పెళ్లి సంబంధం వస్తుంది. హీరో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చూశాక ఆ సంబంధం నిత్యామీనన్ కుటుంబ సభ్యులకు నచ్చదు. కానీ అప్పటికే నిత్యామీనన్ విజయ్ సేతుపతి ఒకరినొకరు ఇష్టపడతారు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొంతకాలానికి ప్రతి ఫ్యామిలీలో లాగే అత్తాకోడళ్ల గొడవలు మొదలవుతాయి. నిత్యా మీనన్ కి ఆమె అత్తగారు, ఆడపడుచుకి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. దీనితో విజయ్ సేతుపత తల్లీ భార్య మధ్యలో నలిగిపోతుంటారు. నిత్యామీనన్ మాటిమాటికి అలిగి పుట్టింటికి వెళ్లిపోవడం.. విజయ్ సేతుపతి బుజ్జగించి ఆమెని వెనక్కి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది.
కానీ ఒకసారి వ్యవహారం విడాకుల వరకు వెళుతుంది. ఆ తర్వాత ఏమైంది ? ఇద్దరూ విడాకులు తీసుకున్నారా ? కలిసి సంతోషంగా జీవించారా అనేది మిగిలిన కథ. దర్శకుడు పాండిరాజ్ అందరికీ తెలిసిన ఫ్యామిలీ ఇష్యూ తోనే ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ మూవీలో వినోదం పుష్కలంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ బాగా కుదిరాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం పండగే అని చెప్పొచ్చు.
55
అనుపమ పరమేశ్వరన్ అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీలో సందడి
సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రం ఆగష్టు 22 నుంచి జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలైంది. మరోవైపు అనుపమ నటించిన పరదా చిత్రం నేడు ఆగష్టు 22న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. అనుపమ నటించిన ఒక చిత్రం ఓటీటీలో మరో చిత్రం థియేటర్స్ లో ఒకే రోజు సందడి చేస్తున్నాయి.