ఎన్టీఆర్, హృతిక్ నటించిన `వార్ 2` బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలుస్తోంది. ఈ మూవీ ఎనిమిదో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మరి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ `వార్ 2`. ఇందులో తారక్ నెగటివ్ రోల్ చేయడం విశేషం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14న విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరో భారీ మూవీ `కూలీ` కి పోటీగా రిలీజ్ అయ్యింది. అయితే నార్త్ లో యష్‌రాజ్‌ఫిల్మ్ భారీగా రిలీజ్ ప్లాన్ చేసిన నేపథ్యంలో పోటీ అయినా లెక్క చేయకుండా విడుదల చేశారు.
DID YOU KNOW ?
`జై లవకుశ`లో
ఎన్టీఆర్ `జై లవకుశ` సినిమాలో నెగటివ్ రోల్ చేశారు. ఇందులో త్రిపాత్రాభినయం చేయగా, ఒక పాత్ర మాత్రం నెగటివ్ షేడ్‌లో ఉంటుంది.
24
`వార్ 2` ఎనిమిదో రోజు వసూళ్లు
ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్‌ని తెచ్చుకున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, సినిమాకి ఉన్న హైప్ కారణంగా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. నాలుగు రోజులు సెలవులు కావడంతో కలెక్షన్లు తగ్గినా ఫర్వాలేదనేలా వచ్చాయి. టాక్‌కి మించే వచ్చాయి. కానీ సోమవారం నుంచి భారీగా పడిపోయాయి. రోజు రోజుకి వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఇక ఎనిమిదో రోజు మరింతగా పడిపోయాయి. గురువారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్లు మాత్రమే వసూలు చేసింది.
34
`వార్ 2` వరల్డ్ వైడ్ కలెక్షన్లు
`వార్ 2` ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందనేది చూస్తే, ఈ మూవీ గురువారంతో మొత్తంగా రూ.320 కోట్లని రాబట్టిందని ట్రేడ్ పండితుల అంచనా. ఇది హిందీలో రూ.150 కోట్లు దాటింది. అలాగే తెలుగు స్టేట్స్ లో రూ.65కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్‌లో రూ.73కోట్లు రాబట్టింది. అలాగే కర్నాటకలో రూ.18కోట్లు, తమిళనాడులో రూ.7కోట్లు, మలయాళంలో 1.75కోట్లు వసూలు చేసింది. ఇలా మొత్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు జరిగిన థియేటర్ బిజినెస్‌లో సగం(షేర్) మాత్రమే రాబట్టింది. ఇంకా సుమారు రూ.160కోట్ల వరకు షేర్ రాబట్టాలి. అంటే రూ.320కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అది అసాధ్యం అని చెప్పొచ్చు.
అయితే ఈ మూవీ ఓవర్సీస్‌లో లాభాల్లో ఉందని చెప్పొచ్చు. అక్కడ థియేట్రికల్ బిజినెస్ రూ.30 కోట్లు. ఇప్పుడు సుమారు రూ.73కోట్లు వసూలు చేసింది. అంటే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. `వార్ 2` ఓవర్సీస్‌లో హిట్ అని చెప్పొచ్చు. అయితే తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. రూ.80కోట్లకు ఆయన తీసుకున్నారు. ఇప్పుడు రూ.33కోట్ల షేర్ వచ్చిందంటే, ఇంకా 47కోట్ల షేర్(90కోట్ల గ్రాస్) రావాలి. ఎనిమిదో రోజు కనీసం కోటి రూపాయల గ్రాస్ కూడా వసూలు చేయలేదు. ఈ లెక్కన ఈ చిత్రం ద్వారా నిర్మాత నాగవంశీకి సుమారు రూ.45కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే తెలుగుకి సంబంధించి రూ.20కోట్ల వరకు నిర్మాణ సంస్థ రిటర్న్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ నటించిన `వార్ 2` తెలుగులో దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు.