26 ఏళ్ళ క్రితం చిరంజీవి, రజినీకాంత్ రేర్ ఫోటో.. ఇద్దరి గెటప్స్ చూశారా, రెప్ప ఆర్పడం కష్టం

Published : Aug 22, 2025, 01:28 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి 26 ఏళ్ళ క్రితం కలుసుకున్న ఒక రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
చిరంజీవి 70వ పుట్టినరోజు 

 మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు, అభిమానులు చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవితో కలిసి నటించిన నటీనటులు ఆ అనుభవాలని గుర్తు చేసుకుంటున్నారు. చిరంజీవిని డైరెక్ట్ చేసిన దర్శకులు పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. 

DID YOU KNOW ?
డ్యూయెల్ రోల్ లో చిరంజీవి ఎమోషనల్ పెర్ఫార్మన్స్
మెగాస్టార్ చిరంజీవి డ్యూయెల్ రోల్ లో నటించిన చిత్రాల్లో స్నేహం కోసం ఒకటి. ఈ చిత్రంలో చిరంజీవి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కి గాను ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 1999లో ఈ చిత్రం 52 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 
25
డ్యూయెల్ రోల్ లో నటించిన చిరంజీవి 

తమిళ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన కేఎస్ రవికుమార్ చిరంజీవితో స్నేహం కోసం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. శరత్ కుమార్ తమిళంలో నటించిన 'నట్పక్కాగా' చిత్రానికి ఇది రీమేక్. తమిళ చిత్రం కూడా రవికుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. 1999లో విడుదలైన స్నేహం కోసం మూవీ మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. 

35
చిరంజీవికి కేఎస్ రవికుమార్ బర్త్ డే విషెస్

సీనియర్ నటుడు విజయ్ కుమార్ చిరంజీవి స్నేహితుడి పాత్రలో నటించారు. మీనా హీరోయిన్. కేఎస్ రవికుమార్ ఆగష్టు 22న చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ స్నేహం కోసం చిత్ర షూటింగ్ లొకేషన్ పిక్స్ షేర్ చేశారు. ఈ రేర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

45
చిరంజీవి మూవీ షూటింగ్ లొకేషన్ లో రజినీ 

చిరంజీవి డ్యూయెల్ రోల్ లో ఉన్న రెండు లుక్స్ ని రవికుమార్ అభిమానులతో పంచుకున్నారు. సర్ప్రైజ్ ఏంటంటే స్నేహం కోసం షూటింగ్ లొకేషన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ సందడి చేశారు. చిరంజీవి వృద్ధుడి గెటప్ లో ఉండగా..ఆయన పక్కనే తెల్ల గడ్డంతో రజినీకాంత్  ఉన్న రేర్ ఫోటో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తోంది. 

55
కేఎస్ రవికుమార్ చిత్రాలు 

ఇక రవికుమార్, రజినీకాంత్ కాంబినేషన్ లో ముత్తు, నరసింహ లాంటి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. రవికుమార్ నందమూరి బాలకృష్ణతో జై సింహా, రూలర్ లాంటి చిత్రాలని తెరకెక్కించారు. నాగార్జునతో బావ నచ్చాడు చిత్రం రూపొందించారు. 

Read more Photos on
click me!

Recommended Stories