విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'గీత గోవిందం'. 2018లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర 127 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక సినిమా ఇదే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.