విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి నటన కోసం వచ్చినా, అన్నంత పేరు రాలేదు. తాజాగా వదిన రష్మిక మందన్న గురించి పెట్టిన పోస్ట్‌తో ఆనంద్ మరోసారి వార్తల్లో నిలిచారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి వార్తల తర్వాత ఇప్పుడు ఆనంద్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఒకే ఇంట్లో పుట్టి, ఒకే రంగంలో ఉన్నా కొందరికే స్టార్‌డమ్ వస్తుంది. దేవరకొండ ఫ్యామిలీలోనూ అన్న విజయ్‌కి వచ్చినంత గుర్తింపు తమ్ముడు ఆనంద్‌కి రాలేదు.
26
స్టార్ డమ్ కోసం ప్రయత్నం..
విజయ్ దేవరకొండ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. కానీ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఒక నటుడు. అయితే అన్నంత పాపులర్ కాలేదు. విజయ్ పెళ్లి రోజున వదిన రష్మిక గురించి పోస్ట్ పెట్టడంతో ఆనంద్ పేరు మళ్లీ వినిపిస్తోంది.
36
ఆనంద్ దేవరకొండ పోస్ట్ వైరల్..
"ఈ రోజు మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. నా వదిన చాలా మంచిది. వాళ్లిద్దరూ జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని ఆనంద్ పోస్ట్ పెట్టారు. అప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్ ఇతని గురించి వెతకడం మొదలుపెట్టారు.
ఆనంద్‌కి ప్రస్తుతం 30 ఏళ్లు. అతను హైదరాబాద్‌లో పుట్టాడు. 'బేబీ' (2023), 'తక్షకుడు', 'దొరసాని' (2019) వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. కానీ అన్న విజయ్ దేవరకొండ అంత స్టార్‌డమ్ రాలేదు.
56
అమెరికాలో ఉద్యోగం వదిలి..
నటన మీద ఆసక్తితో ఆనంద్ అమెరికాలోని 'డెలాయిట్' కంపెనీ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకు తిరిగి వచ్చాడు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివిన ఆనంద్, ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.
66
దొరసారి సినిమాతో ఫేమస్..
ఆనంద్ 2019లో 'దొరసాని' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' (2020) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.