భగవాన్ సత్యసాయి 100వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే స్వయంగా సత్యసాయి పేరు పెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. జయంతి సందర్భంగా స్వామిని తలుచుకుని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. 100వ పుట్టిన రోజు కావడంతో అనుచరులు, భక్తులు సత్యసాయి బాబాను తలుచుకుంటూ భజనలు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ వేడుకల్లో పాల్గొన్ని బాబాను స్మరించుకున్నారు. సచిన్, ఐశ్వర్యరాయ్ లాంటి ప్రముఖులు కూడా బాబా ఉత్సవాల్లో పాల్గొని ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంలో టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఒక ఫోటో పోస్ట్ చేసి.. బాబాగురించి ఎమోషనల్ నోట్ ఒకటి రాశాడు. ఆ హీరో ఎవరో తెలుసా?
25
సత్యసాయి స్వయంగా పేరు పెట్టిన హీరో
ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. చిన్నప్పుడే పుట్టపర్తిలోని సత్యసాయి స్కూల్‌లో చదివిన విజయ్ దేవరకొండ, సత్యసాయి బాబాతో కలిసి దిగిన అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలో విజయ్ కుడివైపు చివర మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు. స్కూల్ రోజుల్లో విజయ్ ఎంతో అమాయకంగా, క్యూట్‌గా కనిపించడంతో.. అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
35
విజయ్ దేవరకొండ ఎమోషనల్ నోట్
ఈ ఫోటోతో పాటు విజయ్ దేవరకొండ సత్యసాయి బాబా గురించి ఓ ఎమెషనల్ నోట్ కూడా రాశాడు. “హ్యాపీ బర్త్ డే స్వామి. నాకు నెలల వయసు ఉన్నప్పుడు ‘విజయ్ సాయి’ అని మీరు పేరు పెట్టారు. నేను ప్రతిరోజూ జీవించడానికి ఆ పేరు నాకు బలం ఇస్తుంది. మీరు మాకు మంచి వాతావరణం అందించారు. అక్కడ చదువుకున్న రోజులన్నీ మా జ్ఞాపకాలలో నిలిచిపోయాయి. మేమందరం ప్రతిరోజూ మీ గురించే ఆలోచిస్తాము, ముఖ్యంగా మంచి-చెడు సమయాల్లో. ప్రపంచానికి మనం చేయగలిగినంత చేయాలి అనే ఆలోచనను మీరు మాలో నాటారు. ఎందుకంటే మేము అవసరాల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చిన సహాయం మా జీవితాలను మార్చింది. 100వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.” అని విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు.
విజయ్ దేవరకొండ చేసిన ఈ ఎమోషనల్ పోస్టు వైరల్ అవ్వడంతో.. అభిమానులే కాదు , సత్యసాయి భక్తులు కూడా విజయ్ భక్తిని మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ లో విజయ్ కు రౌడీ హీరో ఇమేజ్ ఉంది. ఆయన చేసిన అర్జున్ రెడ్డి, కింగ్ డమ్ సినిమాల్లో ఎంత అగ్రెసీవ్ గా కనిపించాడో అందరికి తెలుసు. అటువంటి విజయ్ లో ఇంత భక్తి కోణం ఉందా అని కొంతమంది అభిమానులు ఆశ్చర్చపోతున్నారు.
55
రష్మికతో త్వరలో పెళ్లి..
ఇక విజయ్ దేవరకొండ మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. సాలిడ్ సక్సెస్ కొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయ్ ను విజయం వరించడంలేదు. మాస్ ఇమేజ్ తో పాటు క్లాస్ మూవీస్ కూడా ట్రై చేశాడు రౌడీ హీరో. ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తో రీసెంట్ గానే విజయ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక పెళ్లి డేట్ పై ఇంత వరకూ ఈ జంట నోరు విప్పలేదు. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ కు హిట్లు లేకపోయినా.. రష్మిక మందన్న మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది.