ఆంధ్ర కింగ్‌ తాలూకా మూవీ బాక్సాఫీసు టార్గెట్‌.. రామ్‌ పారితోషికం వెనక్కి ఇవ్వాలంటూ నిర్మాతల డిమాండ్‌

Published : Nov 26, 2025, 01:17 PM IST

రామ్‌ పోతినేని హీరోగా నటించిన `ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ బాక్సాఫీసు టార్గెట్‌ ఎంతనేది క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు అసలు సమస్య రామ్‌ పారితోషికం విషయంలోనే. 

PREV
14
ఒక్క రోజులో రామ్‌ `ఆంధ్ర కింగ్‌ తాలూకా` రిలీజ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేనికి హిట్‌ పడి ఆరేళ్లు అవుతుంది. ఆయన చివరగా `ఇస్మార్ట్ శంకర్‌`తో హిట్‌ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేస్తూ వస్తున్నాయి. `రెడ్‌`, `ది వారియర్స్`, `స్కంధ`, `డబుల్ ఇస్మార్ట్` మూవీస్‌ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో ఇప్పుడు డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు రామ్‌. ప్రస్తుతం ఆయన `ఆంధ్ర కింగ్‌ తాలూకా` అనే చిత్రంలో నటించారు. సినిమా హీరో, అభిమాని కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` ఫేమ్‌ మహేష్‌ బాబు పి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, అభిమానిగా రామ్‌, హీరోగా ఉపేంద్ర నటించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27(గురువారం) విడుదల కానుంది.

24
హీరో, అభిమాని మధ్య బాండింగ్‌ నేపథ్యంలో మూవీ

సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు ఆకట్టుకున్నాయి. హీరోకి, అభిమానికి మధ్య బాండింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా ఉండబోతుందట. అయితే ఉన్నంతలో డీసెంట్‌ టాక్ ఉంది. కాకపోతే ఆశించిన స్థాయిలో బజ్‌ లేదు. డిఫరెంట్‌ కథతో వస్తోన్న మూవీ కావడంతో ఆడియెన్స్ ని ఎంత మాత్రం ఆకట్టుకుంటుందనేది ప్రశ్నార్థంగా మారింది. అయితే ఇటీవల రామ్‌ కి సక్సెస్‌ లేకపోయినా ఈ సినిమాకి మంచి బిజినెస్‌ జరిగిందట.  అదిరిపోయే వ్యాపారం జరిగిందని తెలుస్తోంది.

34
ఆంధ్ర కింగ్‌ తాలూకా బాక్సాఫీసు టార్గెట్‌

`ఆంధ్ర కింగ్‌ తాలూకా` చిత్రానికి రూ.27కోట్ల ప్రీ రిలీజ్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. నైజాంలో తొమ్మిది కోట్లు, సీడెడ్‌లో మూడు కోట్లు, ఆంధ్రాలో పది కోట్లకు అమ్ముడు పోయిందట. ఇక కర్నాటక, ఇతర అన్నీ స్టేట్స్ కలిపి రూ.2కోట్లు, ఓవర్సీస్‌లో మూడు కోట్ల వ్యాపారం జరిగిందట. ఇలా మొత్తంగా రూ.27కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ లెక్క ప్రకారం రూ.28కోట్ల షేర్‌ వస్తే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. అంటే దాదాపు రూ.55కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్లని రాబట్టాలి. అప్పుడే ఈ సినిమా హిట్‌ ఖాతాలో పడుతుంది. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. అయితే పాజిటివ్‌ టాక్‌ వస్తే ఇంత మాత్రం వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

44
చిక్కుల్లో రామ్‌ పారితోషికం

ఇదిలా ఉంటే ఈ మూవీకి రామ్‌ పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్‌కి మొదట రూ.30కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకున్నారట. కానీ సినిమాకి బజ్‌ లేదు. బడ్జెట్‌ రూ.70కోట్లు అయ్యిందట. ఇది రికవరీ కష్టమనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారు. దీంతో రామ్‌ పారితోషికం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆయన రెమ్యూనరేషన్‌ రూ.20కోట్లకు తగ్గించాలని రామ్‌పై ఒత్తిడి తెస్తున్నారట. మరీ రామ్‌ ఒప్పుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. యు/ఏ సర్టిఫికేట్‌ పొందిన ఈ మూవీ ఈ రోజు సాయంత్రం నుంచే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుందనేది ఈ రాత్రికే క్లారిటీ రాబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories