నాగార్జున లంచ్ ప్లేట్ లో స్పెషల్ ఐటమ్, కింగ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా?

Published : Nov 26, 2025, 11:49 AM IST

Nagarjuna Lunch Plate Secret : 66 ఏళ్ల వయస్సులో యంగ్ హీరోలకు పోటీ ఇస్తోన్న కింగ్ నాగార్జున ఏం తింటారు? టాలీవుడ్ మన్మథుడి లంచ్ ప్లేట్ లో స్పెషల్ గా ఉండే ఐటమ్ ఏంటో తెలుసా?

PREV
14
66 ఏళ్ల టాలీవుడ్ మన్మధుడు

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ వయస్సులో కూడా తగ్గేది లేదంటున్నారు. ఈమధ్యే 66 లోకి అడుగు పెట్టిన కింగ్ .. వయసు పెరుగుతున్నా కొద్ది గ్లామర్, ఫిట్నెస్ కూడా పెంచుకుంటూ.. అంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. చిరునవ్వుతో, ప్రశాంతంగా కనిపించే నాగార్జునను చూసి చాలా మంది ఆయన ఇంత యంగ్‌గా ఎలా ఉంటారో, రోజూ ఏం తింటారో తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున తన ఆహారపు అలవాట్లు, దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

24
నాగార్జున భోజనంలో ఏం తింటారు?

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున, “నేను చాలా మందిలా.. తిండి తినకుండా కడుపు మార్చుకోవడం వంటి కఠిన నియమాలు పెట్టుకోను. హ్యాపీగా అన్నీ తింటాను. కడుపు నిండా తిన్నప్పుడే శక్తి వస్తుంది. కానీ తినడంతో పాటు దానికి తగ్గ వ్యాయామం కూడా ఉండాలి. మధ్యాహ్నం భోజనంలో వైట్ బదులుగా బ్రౌన్ రైస్ తింటాను. దానిలోకి నెయ్యి కలుపుకుని రెండు లేదా మూడు రకాల ఆకు కూరలతో తింటాను. పప్పు, ఆకుకూరలు, కూరగాయలతో పాటు పక్కాగా పెరుగు ఉండాల్సిందే. వాటితో పాటు ఒక రోటిపచ్చడి కూడా నంజుకోవడం అలవాటు'' అని నాగార్జున అన్నారు.

34
బెండకాయ అంటే అంత ఇష్టమా?

అయితే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. మరో ఐటమ్ కూడా నాగార్జున ఎక్కువగా తింటారట. అదే బెండకాయ కూర. ఆయ ఇది కూడా ఎక్కువగా తింటారట. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనంలో బెండకాయ కూర తప్పక ఉండాలని సమాచారం. సాధారణంగా చాలా మంది బెండకాయ కూరపై ఆసక్తి చూపరు. కానీ అందులో చాలా విటమిన్స్ ఉంటాయి. ఈ కూరలో విటమిన్ C, విటమిన్ D, విటమిన్ K, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మాంగనీస్, కాపర్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. నాలుగైదు రకాల పండ్లు తిన్నంత శక్తి బెండకాయ వల్ల వస్తుంది. అందుకే నాగ్ బెండకాయ ఎక్కువగా తింటాడట.

44
ఏఎన్నార్ నాగార్జునకు చెప్పిన టాప్ హెల్త్ సీక్రెట్..

డిన్నర్ తర్వాత ప్రతి రాత్రి ఒక స్వీట్ తినడం కూడా నాగార్జున అలవాటు. స్వీట్ తినకపోతే ఆయనకు నిద్ర పట్టదట. అయితే ఎంత తిన్నా, ఎంత బిజీగా ఉన్నా, రోజులో ఒక గంట వ్యాయామం చేయడం మాత్రం ఆయన ఎప్పుడూ మానుకోరు. సినిమాలు, స్టూడియో, వ్యాపారాలు, ఇంత ప్రెజర్ మధ్య కూడా నాగార్జున ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఈ విషయం అడిగితే.. ఆయన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహాను గుర్తు చేశారు. “ఏదైనా లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు, ఆలోచించి బాధపడినా ఏమి మారదు, జరగాల్సింది జరుగుతుంది, దాన్నిమార్చలేం.. కాబట్టి ఏవిషయం కూడా మనసులోకి ఎక్కువగా తీసుకో” అనే సూత్రం పాటిండం వల్లే.. తాను ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు నాగార్జున చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories