ఇక ఈ సీజన్ మొత్తానికి కలిపి 15 కోట్లు రెమ్యునరేషన్ ను విజయ్ డిమాండ్ చేశాడట. ఇక బిగ్ బాస్ టీమ్ కూడా ఇందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అటుబవిజయ్ కూడా గతంలో ఉన్న క్రేజ్ ను తిరిగిపొందే ప్రయత్నంచేస్తున్నాడు.
వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న విజయ్ కు బిగ్ బాస్ మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. విజయ్ నిజంగా ఈ సీజన్ ను హోస్ట్ చేస్తే.. ఆయన ఇమేజ్ కొంత లో కొంత పెరగడంతో పాటు.. నెక్ట్స్ వచ్చే సినిమాీలకు కూడా డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇక మళ్ళీ జనాల మధ్యకు వెళ్ళవచ్చు అని విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇక విజయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ను నిజంగా హోస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఈలోపు ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు విజయ్. ఈసారి సరికొత్తగా రాబోతున్నాడు. ఎలాగైనా సాలిడ్ సక్సెస్ టార్గెట్ చేశారు. ఏం జరుగుతందో చూడాలి.