ఎన్టీఆర్ కి పెద్ద దెబ్బ: వార్ 2 షూటింగ్ వాయిదా?

Published : Mar 11, 2025, 07:45 AM IST

War 2:  హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 షూటింగ్ లో హృతిక్ కాలికి గాయం కావడంతో సాంగ్ షూట్ వాయిదా పడింది. ఇది ఎన్టీఆర్ యొక్క తదుపరి సినిమా షెడ్యూల్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

PREV
14
ఎన్టీఆర్ కి పెద్ద దెబ్బ: వార్ 2 షూటింగ్ వాయిదా?
Hrithik Roshan leg injury delays War 2 dance-off with Jr NTR to May in telugu


War 2:  బాలీవుడ్‌ స్టార్ హీరో  హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. బాలీవుడ్ స్టార్ యంగ్ డైరక్టర్  అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ స్పై థ్రిల్లర్‌ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా (War 2) గురించిన ఓ విషయం బయిటకు వచ్చి అభిమానులను ఆందోళనలో పడేస్తోంది. ఈ సినిమా సాంగ్ సమయంలో హృతిక్ రోషన్ కు గాయాలు అయ్యాయని ఆ వార్త సారాంశం. అసలేం జరిగిందో చూద్దాం. 
 

24
Hrithik Roshan leg injury delays War 2 dance-off with Jr NTR to May in telugu


తాజాగా హృతిక్‌ రోషన్‌, తారక్‌లపై ఎపిక్‌ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటిం్  చేస్తున్నారు. ఇది ముంబై యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో జరుగుతోంది. 500 మందికి పైగా డ్యాన్సర్లతో ఆరు రోజులపాటు భారీ స్థాయిలో ఈ సాంగ్‌ను  చిత్రీకరిస్తున్నారు.

బాస్కో (Basco)మార్టీస్‌ కొరియోగ్రాఫీ అందిస్తుండగా ప్రీతమ్‌ ఈ పాటకు  సంగీతాన్ని అందించారు. ఈ పాటతో సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. అయితే అనుకోని విధంగా రిహార్సిల్ సమయంలో హృతిక్ కాలికి గాయమైంది. దాంతో షూటింగ్ ఆగిపోయింది.

హృతిక్  కాలు నయం కావడానికి వైద్యులు అతనికి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. దాంతో సాంగ్ షూట్ వాయిదా పడింది. అయితే ఈ ఎఫెక్ట్ ఎన్టీఆర్ షెడ్యూలపై పడే అవకాసం ఉందంటున్నారు. ప్రశాంత్ నీల్ చిత్రంలో చేరడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు, కానీ ఈ ఊహించని పరిణామం అతన్ని వార్ 2 సెట్స్‌కి మళ్ళి వెల్లే పరిస్దితిని కలిగిస్తుంది. 
 

34
Hrithik Roshan leg injury delays War 2 dance-off with Jr NTR to May in telugu

ఈ చిత్రం గురించి రైటర్ అబ్బాస్ మాట్లాడుతూ...‘‘వార్‌ 2’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఆగస్టు 25న విడుదలయ్యే అవకాశం ఉంది. ఆరోజు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌లను (NTR) థియేటర్‌లో కలుద్దాం. ‘వార్‌ 2’లో డైలాగులన్నీ నేనే రాశాను.

ఇక షారుక్‌ఖాన్‌, సిద్ధార్థ్ ఆనంద్‌ల కాంబోలో ఓ సినిమా ప్రారంభం కానుంది. అలాగే ‘పఠాన్‌ 2’ కూడా సిద్ధమవుతోంది. వీటికి కూడా వర్క్‌ చేస్తున్నాను. మీ అందరికీ ఈ చిత్రాల్లో డైలాగులు నచ్చుతాయని ఆశిస్తున్నా’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

44
Hrithik Roshan leg injury delays War 2 dance-off with Jr NTR to May in telugu


హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘వార్‌’. ఈ స్పై థ్రిల్లర్‌ సూపర్‌ సక్సెస్‌ సాధించి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘వార్‌2’ (War 2). ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.

గతంలో సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ఖాన్‌లు ఏజెంట్‌ పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్‌ పాత్ర ఉంటుందనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ చిత్రం షూటింగ్‌లో భాగం కానున్నారు. 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సక్సెఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘దేవర’ (Devara)లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ War2లోనూ నటిస్తున్నారు. మరోవైపు సెన్సేషన్ డైరెక్టర్ తో ప్రశాంత్ నీల్ తో NTR31  ఉన్న విషయం తెలిసిందే. 
 

Read more Photos on
click me!

Recommended Stories