Pushpa 2 vs Chhaava : ఛావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈసినిమాకు ఎంత రెస్పాన్స్ వస్తుందంటే.. అల్లు అర్జున్ పుష్ప2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేిసింది. ఇంతకీ విషయం ఏంటంటే?
14
పుష్ప 2ను దాటేసిన ఛావా మూవీ!
Pushpa 2 vs Chhaava : రీసెంట్ గా హిందీలో రిలీజ్ అయిన 'ఛావా' బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. విడుదలైన నాలుగు వారాల తర్వాత కూడా వసూళ్ల విషయంలో తగ్గేదే లేదంటోంది. కలెక్షన్ల వరద పారిస్తోంది. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
వీకెండ్స్ మాత్రమే కాకుండా వీక్ డేస్ లో కూడా సినిమా హాళ్ళు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ప్రతీరోజు రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది ఛావా మూవీ. అంతే కాదు తాజాగా ఈ సినిమా అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులను కూడా బద్దలు కొట్టింది.
అయితే పుష్ప2 రికార్డ్స్ ను ఓన్లీ మహారాష్ట్రలో మాత్రమే బీట్ చేయగలిగింది ఛావా సినిమా. ఇక ఈ మూవీకి మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇక మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా మొత్తం వసూళ్ల కంటే ఎక్కువ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
15 రోజుల్లో పుష్ప 2 సినిమా వసూళ్లను దాటేయడం మామూలు విషయం కాదు. పుష్ప 2 సినిమా మహారాష్ట్రలో 240 కోట్లు వసూలు చేసింది. కానీ ఛావా సినిమా 15 రోజుల్లో 260 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది.
మొన్నటి వరకు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమానే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉండేది. కానీ ఇప్పుడు ఛావా ఆ స్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్రలో దీని ఫైనల్ కలెక్షన్ 300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిజానికి ఛావా, పుష్ప 2 సినిమాలు ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్న ఛావా సినిమా, పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ చూసి వెనక్కి తగ్గిందట.
ఏ సినిమాను తక్కువ అంచనా వేయకూడదు. పుష్ప 2 లాంటి సినిమా కంటే మా సినిమా పెద్దది అని విక్కీ కౌశల్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అంతేకాదు సంబరాలు చేసుకుంటున్నారు
ఛావా సినిమా విడుదలైన మూడో శనివారం కూడా ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా త్వరలో 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాకు బాలీవుడ్లో వచ్చిన ఆదరణ చూసి ఛావా సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది.
బాలీవుడ్లో మాత్రమే 500 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. మంచి వసూళ్ళు వస్తున్నాయి అనుకున్న టైమ్ లో. ఐ బొమ్మాలో ఈసినిమా రావడంతో నిర్మాతలకు అది పెద్ద తలనొప్పిగా మారింది.