తన తెలంగాణ యాసపై ట్రోల్స్.. చెంపచెల్లుమనిపించే సమాధానం ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

Published : Aug 03, 2025, 06:26 AM IST

విజయ్‌ దేవరకొండ తన తెలంగాణ యాసపై ట్రోల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. 

PREV
15
`కింగ్డమ్‌` సక్సెస్‌ విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ తాజాగా `కింగ్డమ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా విజయవంతంగా రన్‌ అవుతోంది. మంచి వసూళ్లని రాబడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం విజయ్‌ దేవరకొండ ప్రింట్‌, వెబ్‌ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `కింగ్డమ్‌` సక్సెస్‌కి సంబంధించిన బెస్ట్ కాంప్లిమెంట్స్ గురించి వెల్లడించారు. అలాగే తన తెలంగాణ యాసపై ట్రోల్స్ పై కూడా రియాక్ట్ అయ్యారు.

DID YOU KNOW ?
విజయ్‌ తొలి పాన్‌ ఇండియా మూవీ
విజయ్‌ దేవరకొండ తొలి పాన్‌ ఇండియా మూవీ `డియర్‌ కామ్రెడ్‌`. దీన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేయగా, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
25
`కింగ్డమ్‌` రిజల్ట్ పై విజయ్‌ రియాక్షన్‌

`కింగ్డమ్‌` మూవీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ ని వివరిస్తూ, `ఈ సినిమా సక్సెస్‌తో చాలా రిలీఫ్‌ అయ్యాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో సినిమాకి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. `పెళ్లి చూపులు` హిట్ అయినప్పుడు ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. `కింగ్‌డమ్` విడుదలకు ముందు నాక్కూడా అలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ టాక్‌ వచ్చిందో అప్పుడు రిలీఫ్‌ అయ్యాను` అని అన్నారు విజయ్‌.

35
వారి స్పందన చూస్తే కన్నీళ్లు వచ్చేశాయి

`సినిమా బాగుందని అందరు చెబుతుంటారు. అది కామన్‌, కానీ మనల్ని బాగా ప్రేమించేవాళ్లు పంచుకునే ఆనందం వేరే లెవల్‌లో ఉంటుంది. పదేళ్ల క్రితం నేనంటే ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని లక్షల, కోట్ల మందికి తెలుసు. నన్ను చూసి సినిమా చూసేందుకు థియేటర్‌కి వస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత హిట్‌ కొడితే వారంతా ఎమోషనల్‌ అవుతున్నారు. `అన్నా మనం కొట్టామన్నా` అంటూ ఏడుస్తూ మెసేజ్‌లు, వీడియోలు పంపుతుంటే ఇంతకంటే ఏం కావాలనిపించింది. ఇంతటి ప్రేమని పొందుతున్నందుకు యాక్టర్ గా నేను లక్కీగా భావిస్తున్నా. వారి ప్రేమని మాటల్లో చెప్పలేను. వాళ్లు ఏడుస్తూ వీడియోలు పంపుతుంటే నాకు కూడా ఎమోషనల్‌`గా ఉందన్నారు విజయ్‌ దేవరకొండ.

45
కింగ్డమ్‌కి సుకుమార్‌ ప్రశంసలు

`కింగ్డమ్‌` సినిమాకి ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అనే ప్రశ్నకి విజయ్‌ స్పందిస్తూ, యూఎస్‌లో సినిమా చూసిన దర్శకుడు సుకుమార్‌ నాకు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంసలు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. `అర్జున్ రెడ్డి` సమయం నుంచే నేను, సుకుమార్ గారు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. భవిష్యత్ లో మా కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం అయితే నా దృష్టి అంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే ఉంది` అని చెప్పారు విజయ్‌.

55
`కింగ్డమ్‌`కి రెండు వారాలు తిరుగే లేదు

ఈ సందర్భంగానే తెలంగాణ యాసపై ప్రశ్న ఎదురైంది. `కల్కి`లో అర్జునుడు పాత్రకి డైలాగ్‌ డెలివరీ తెలంగాణ యాసకి దగ్గరగా ఉందని అప్పట్లో చాలా మంది విజయ్‌ని ట్రోల్‌ చేశారు. దీనిపై విజయ్‌ స్పందస్తూ చెంపచెల్లుమనిపించే సమాధానం ఇచ్చారు. అర్జునుడు ఏ భాషలో మాట్లాడాడో తెలిస్తే చెప్పాలని, అర్జునుడు డైలాగ్‌లను వేరే యాసలో చెబితే వినాలని ఉందని, అర్జునుడికి ఇదే భాషలో మాట్లాడాలనే రూల్‌ ఏదైనా ఉందా? ఆయన ఏ యాసలో మాట్లాడారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. సైలెంట్‌గా ట్రోలర్స్ కి మతిపోయే సమాధానం చెప్పారు. సినిమాలో మాదిరిగా తాను కూడా ఓ దేశానికి రాజు అయితే ఏం చేస్తానో తెలిపారు. మనం కులాలు, మతాలు, ప్రాంతాలు అనే బారియర్స్ ని గిరుగీసుకుని బతుకుతున్నాం. కొందరు తమ రాజకీయ, అధికార స్వలాభం కోసం ఇవన్నీ సృష్టించారని, తాను రాజు అయితే ఈ బారియర్స్ అన్నింటిని బ్రేక్‌ చేస్తానని చెప్పారు విజయ్‌ దేవరకొండ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories