ఇందులో లక్కీ తల్లి చిన్నారి పేరెంట్స్ చెబుతూ, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, వారి కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందని, వారి చిరునవ్వు, స్నేహ పూర్వక స్వభావం ఈ టూర్‌కి సంతోషాన్ని చేకూర్చిందని తెలిపారు. వారితోపాటు వారి కుటుంబంతో గడిపిన సమయం ఈ అనుభవాన్ని ప్రత్యేకంగా, సొంత ఇంటి వాతావరణంలా అనిపించేలా చేసిందని చెప్పారు. వారంతా ఎంతో ప్రేమతో, దయతో, నిరాడంబరంగా ఉన్నారని, దీంతో మేమూ వాళ్ల మధ్య ఉన్నామనే భావన కలిగిందన్నారు. ఎన్నో అందమైన సంభాషణలు, నవ్వులు, ఎప్పటికీ గుర్తిండిపోయే ఆనంద క్షణాలను పంచుకున్నాం. అక్కడి వాతావరణం హృదయాన్ని హత్తుకునే అనుభూతినిచ్చింది. వారు ప్రతిభావంతులే కాదు, వినయవంతులు. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేము అని వెల్లడించారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.