ఇండియన్ సినిమాను ఊపు ఊపేస్తోంది ధురంధర్ 2 సినిమా. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రచ్చ చేస్తోంది. రెండో రోజు ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజులు కలిపి ఎంత సాధించిందంటే?
రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్: ది రివెంజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది. థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. రెండో రోజు కూడా ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేస్తూ దూసుకుపోతోంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం శుక్రవారం ఈ చిత్రం రూ. 74.70 నుంచి 76 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో రెండు రోజుల (పెయిడ్ ప్రివ్యూలు సహా) మొత్తం వసూళ్లు రూ. 200 కోట్ల మార్క్‌ను దాటాయని సమాచారం.
25
ధురంధర్ 2 కలెక్షన్లు లెక్కలు..
సాక్నిల్క్ ట్రేడ్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఈ సినిమా బుధవారం జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ. 43 కోట్లు, గురువారం రూ. 103 కోట్లు, శుక్రవారం సుమారు రూ. 74.70-76 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 220.7 నుంచి 222 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు అయ్యాయి.
దేశీయ స్థాయిలో ఈ చిత్రం గ్రాస్ కలెక్షన్ సుమారు రూ. 260.78 కోట్లకు చేరుకుంది. భారతదేశవ్యాప్తంగా 20,125 షోలలో విడుదలైన ధురంధర్ ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో భారీ స్పందనను పొందుతోంది. హిందీ వెర్షన్‌కు 63 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదవడం విశేషం.
35
సౌత్ మార్కెట్ లో ధురంధర్ పరిస్థితి..
ఇక సౌత్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ధురంధర్ వసూళ్లు తక్కువగానే ఉన్నాయి. డబ్బింగ్ వెర్షన్లు ఎక్కువగా విడుదల కాకపోవడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు. రెండో రోజు తెలుగులో రూ. 0.76 కోట్లు, తమిళంలో రూ. 0.24 కోట్లు, మలయాళంలో రూ. 0.01 కోట్లు, కన్నడలో రూ. 0.02 కోట్లు మాత్రమే వసూళ్లు నమోదు అయ్యాయి.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈద్ వీకెండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరింత వేగంగా వసూళ్లు పెంచుకునే అవకాశముంది. శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో.. ఈ రెండు రోజుల్లో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విధంగా ఓపెనింగ్ వీకెండ్ ముగిసే సమయానికి దేశీయంగా రూ. 450 నుంచి 500 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
55
ఒక గూఢచారి సాహసం.. ధురంధర్
‘ధురంధర్: ది రివెంజ్’ ఒక హై-స్టేక్స్ జియోపాలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రణవీర్ సింగ్ ‘హమ్‌జా అలీ మజారీ’ అనే భారతీయ గూఢచారి పాత్రలో నటించారు. పాకిస్తాన్‌లోని టెర్రర్-క్రిమినల్ నెట్‌వర్క్‌లో చొరబడే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి కీలక పాత్రలు పోషించారు.