Vijay Deverakonda Request విజయ్‌ దేవరకొండ, రష్మికలకు కొత్త తలనొప్పి.. పర్సనల్‌ విషయాలు లీక్‌పై అసహనం

Published : Feb 19, 2026, 07:33 AM IST

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లికి సంబంధించిన సమాచారం, వ్యక్తిగత ఫోన్ నెంబర్లు సోషల్‌ మీడియాలో లీక్‌ చేసి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వారి టీమ్‌ స్పందించి అసహనం వ్యక్తం చేసింది. 

PREV
15
పెళ్లి పనుల్లో బిజీగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌ లో వీరి వివాహం జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్‌రెడీ ప్రారంభమయ్యాయి. గెస్ట్ లకు ఇన్విటేషన్‌ కార్డ్ లు కూడా పంచుతున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పెళ్లి పత్రిక ఇచ్చారు విజయ్‌. అయితే  విజయ్‌ ఇన్విటేషన్‌ కార్డ్ లీక్‌ అయ్యింది.

25
ఈ నెల 26న ఉదయ్‌ పూర్‌లో విజయ్‌, రష్మిక పెళ్లి

ఈ నెల 26న ప్రైవేట్‌ ఈవెంట్‌గా మ్యారేజ్‌ చేసుకుంటున్నామని, మార్చి 4న రిసెప్షన్‌ ఉందని, దానికి హాజరు కావాలని ఆ లీక్‌ అయిన ఇన్విటేషన్‌ కార్డ్ లో ఉంది. హైదరాబాద్‌లోనే ఈ రిసెప్షన్‌ నిర్వహిస్తున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇన్విటేషన్‌ కార్డ్ లీక్‌ కావడంతోపాటు పెళ్లి, రిసెప్షన్‌ వివరాలను కూడా లీక్‌ చేశారు కొందరు దుండగులు. ఈవెంట్‌కి సంబంధించిన సమాచారం, ఫోన్‌ నెంబర్లు కూడా వెల్లడించి వైరల్‌ చేస్తున్నారు. ఇది వారికి పెద్ద తలనొప్పిగా మారింది.

35
పెళ్లి, రిసెప్షన్‌ వివరాలు, ఫోన్‌ నెంబర్ల లీక్‌పై విజయ్‌ టీమ్‌ అసహనం

ఈ నేపథ్యంలో దీనిపై విజయ్‌ దేవరకొండ, రష్మిక టీమ్‌ అసహనం వ్యక్తం చేసింది. పెళ్లి కార్డ్ పై ముద్రించి ఉన్న విజయ్‌, రష్మిక ఫోన్‌ నెంబర్లు, ఆహ్వానితుల ఫోన్‌ నెంబర్లని, అలాగే వ్యక్తిగత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి వారి ప్రైవసీకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారి టీమ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి అనేది వ్యక్తిగత ఈవెంట్‌ అని, దాన్ని అంతే పర్సనల్‌గా ఉంచాలని, ఇలా చేయడం కరెక్ట్ కాదని, వ్యక్తిగత ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలని, ఇలాంటి పోస్ట్ ల విషయంలో సంయమనం పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయోద్దని చెబుతున్నారు.

45
విజయ్‌, రష్మిక పెళ్లికి కండీషన్లు

ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించి కూడా వాళ్లు కొన్ని కండీషన్లు పెట్టారట. ఉదయ్‌ పూర్‌లో జరిగే పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు, మిత్రులు మాత్రమే హాజరవుతారు. లిమిటెడ్‌ గెస్ట్ లతోనే మ్యారేజ్‌ని చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫోన్‌ల విషయంలో విజయ్‌, రష్మికలు కండీషన్‌ పెట్టారట. పెళ్లి సమయంలో ఫోన్లు వాడొద్దని, ఫోటోలు, వీడియోలు తీయోద్దని చెప్పారట. పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని లీక్‌ చేయోద్దని చెప్పినట్టు సమాచారం. 

55
విజయ్‌ దేవరకొండ, రష్మిక నటించిన సినిమాలివే

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇన్నాళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఎట్టకేలకు మ్యారేజ్‌కి రెడీ అయ్యారు. ప్రస్తుతం విజయ్‌ `రౌడీ జనార్థన్‌`, `రణబాలి` చిత్రాల్లో నటిస్తున్నారు. రష్మిక మందన్నా `మైసా`తోపాటు `రణబాలి` అలాగే హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories