విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?

Published : Feb 24, 2026, 06:44 AM IST

విజయ్ దేవరకొండ ‌- రష్మిక మందన్న పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇద్దరు ఒక్కటి కాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు కూడా. ఈ క్రమంలో విజయ్, రష్మికల ఏజ్ గ్యాప్ పై పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎంత?

PREV
15
రహస్యంగా ప్రేమించుకున్న రష్మిక - విజయ్..

టాలీవుడ్ ప్రేమజంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లిపై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ముగింపు పలికారు. చాలా కాలంగా రహస్యంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. వైవాహిక బంధంతో ఒక్కటవుతున్నట్లు స్వయంగా అధికారిక ప్రకటన చేశారు. 

అభిమానులు తమపై చూపిస్తున్న అభిమానానికి గుర్తుగా, తమ పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘విరోష్’ అనే పేరుతో ఈ వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ పేరుతో సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.

25
విజయ్ - రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంత?

ఈ పెళ్లి ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా వయసు తేడా హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్నెట్ సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించారు (36 ఏళ్లు). రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న జన్మించారు (29 ఏళ్లు). వీరిద్దరి మధ్య సుమారు ఏడు సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ, అంత తేడా ఉన్నటే అనిపించదు. ఈ విషయంపై అభిమానులు రకరకాల అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.

35
ఉదయ్‌పూర్ లో వివాహ వేడుకలు..

విజయ్ - రష్మిక పెళ్లి వేడుకలు రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో జరగనున్నాయి. ఫిబ్రవరి 26న అక్కడి ఒక పురాతన హిస్టారికల్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా పెళ్లి జరగనుంది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పరిమితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. 

ఈ వేడుకల కోసం విజయ్ ఇంటర్నేషనల్ సెక్యురిటీని కూడా ఏర్పాటు చేశారట. ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బంధువులకు కూడా ముందుగానే కొన్ని కండీషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.

45
పెళ్లి వేడుకల షెడ్యూల్ ఇదే..

ఈరోజు ఫిబ్రవరి 24న హల్దీతో పెళ్లి వేడుకలు మొదలువుతాయి.. 25న సంగీత్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వాటతో పాటు మెహెందీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 26న ప్యాలెస్ లో పెళ్లి.. ఆతరువాత ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మార్చి 4న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

55
గీతగోవిందంతో మొదలైన బంధం..

విజయ్, రష్మికల పరిచయం గీత గోవిందం చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సమయంలో వారి స్నేహం గాఢమైన ప్రేమగా మారినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.ఈ సీనిమాలో వారి డీప్ లిప్ లాక్ చూసిన ఆడియన్స్ కు వీరిద్దరి మధ్య సమ్ థింగ్, సంమ్ థింగ్ అని టాక్ మొదలయ్యంది. 

కానీ వారు మాత్రం తమ బంధంపై ఎప్పుడ స్పందించలేదు. అధికారికంగా స్పందించని ఈ జంట, వెకేషన్ ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా వీరి పెళ్లి ప్రకటనతో.. అది నిజం అయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories