విజయ్ దేవరకొండకు గాయాలు, షూటింగ్ స్పాటో ప్రమాదం, అయినా తగ్గేదిలేదంటున్న రౌడీ హీరో.

First Published | Nov 4, 2024, 9:43 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లోజరిగిన ప్రమాదంలో విజయ్ గాయపడినట్టు సమాచారం. 
 

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. VD12సినిమా షూటింగ్ బిజీలో ఉన్న రౌడీ హీరోకు షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయాలు అయ్యాయని సమాచారం. ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా.. షెడ్యుల్ ప్రకారం షూటింగ్ ను కంటీన్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read: సమంతతో కలిసి నాగార్జునను మోసం చేసిన నాగచైతన్య

Vijay Devarakonda, VD 12, gowtham tinnanuri

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా తన 12 వ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ  సినిమా షెడ్యుల్ కోసమే విజయ్ తెగ కష్టపడుతున్నాడు. అంతే కాదు మళ్లీ అర్జున్ రెడ్డి తరువాత డిఫరెంట్ గా విజయ్ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. 

Also Read: రజినీకాంత్ ముందు మోహన్ బాబు పరువు తీసిన చిరంజీవి,


వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు. ఒక రకంగా గీత గోవిందం తరువాత ఆయనకు అన్నీ యావరేజ్ లేదా ప్లాప్ సినిమాలే ఎదురయ్యాయి. ఎన్ని ప్రయోగాలు చేసినా.. అవి కలిసి రావడంలేదు.

యాక్షన్ హీరోగా ట్రై చేశాడు, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ను వరుసగా ట్రై చేశాడు. అయినా సరే ఏవీ వర్కౌట్ అవ్వలేదు. కాస్తో కూస్తో.. ఆమధ్య వచ్చి ఖుషీ సినిమా పర్వాలేదు అనిపించింది. అంతకు ముందు చాలా కాన్ఫిడెంట్ గా చేసిన సినిమాలు గట్టిగా హ్యాండ్ ఇచ్చాయి విజయ్ కు. 

Also Read: ప్రభాస్ కు రెండు మేజర్ సర్జరీలు జరిగాయా.. రామ్ చరణ్ చెప్పిన రహస్యం ఏంటంటే..?

మరీముఖ్యంగా పాన్ ఇండియా హీరోగా సెటిల్ అవ్వాలని గట్టిగా ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ.పూరీ జగన్నాథ్ తో కలిసి రౌడీ హీరో చేసిన లైగర్ సినిమా గట్టిగా దెబ్బేసింది. అంతే కాదు ఈసినిమా ముందు ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ కాన్ఫిడెంట్.. కాస్త ఓవర్ అయిపోయింది. దాంతో ఆయన లైగర్ డిజాస్టర్ తరువాత సైలెంట్ అయిపోయాడు. కాని సినిమాల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు విజయ్. తన ప్రయత్నం తాను గట్టిగా చేస్తున్నాడు. 

విజయ్ దేవరకొండ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా విజయ్ తో సినిమాకురెడీ అంటున్నాయి. ఎన్ని ప్లాప్ లు వచ్చినా.. విజయ్ దేవరకొండ ఇమేజ్ మాత్రం ఏమాతమరం తగ్గలేదు. దాంతో ఆయనతో సినిమాకు సై అంటున్నారు స్టార్ ప్రొడ్యూసర్లే. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా హిట్ అయితే.. విజయ్ కాస్త ఊపిరి పిల్చుకునే అవకాశం ఉంది. 

Latest Videos

click me!