అది తీసుకునే రోజు ముందు ఉంది అంటూ కౌంటర్ గా పెద్ద పెద్ద వాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదం ఏదో ఒక రకంగా నడుస్తూనే ఉంది. మధ్య మధ్యలో ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంది. ఈమధ్య కాలంలో 2021 మా ఎన్నికల టైమ్ లో మెగా వర్సెస్ మంచు అన్నట్టుగా మారిపోయింది.
మెగా ఫ్యామిలీ ప్రకాశ్ రాజును పోటీకి నిలబెట్టగా.. మంచు విష్ణు కూడా పోటీలో నిలబడ్డారు. ఇక నందమూరి ప్యామిలీ నుంచి బాలయ్య కూడా విష్ణుకుసపోర్ట్ చేశారు. ఇక మంచు విష్ణు గెలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు చిరంజీవి మీద ఆరోపణలు చేశాడు.
చిరంజీవి అంకుల్ నన్ను పోటీ నుండి తప్పుకోమన్నాడని మీడియా ఎదుట కామెంట్స్ చేశాడు.ఆ గొడవ చాలా కాలం నడిచింది. ఇక అంతకు ముందు కూడా దాసరి నారాయణ రావు చనిపోయినప్పుడు ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఉండాలని అందరు కోరుకున్నారు. కాని మోహన్ బాబు మళ్లీ అడ్డుపడ్డారు.