అంతలా ప్రేమించుకుని.. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా బ్రతికిన ఈ జంట.. నిండా నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయలేదు. మన్పర్ధలు, ఈగో ఇష్యూస్ తో.. ఇద్దరు మాట్లాడుకుని కలిసి బ్రతకలేము అని డిసైడ్ అయ్యి విడాకులు తీసుకున్నారు. అంత మంచి జంట.. పెళ్ళి విషయంలో కూడా సమంత మనసు నొప్పించలేదు నాగచైతన్య.
క్రిష్టియన్ పద్దతితో పాటు హిందూ సాంప్రదాయం ప్రకారం రెండు రకాలుగా పెళ్లి చేసుకున్నవీరి మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో ఇప్పటికీ వారి అభిమానులకు అర్ధం కావడంలేదు. ఏది ఏమైనా సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య.. ఆతరువాత మరో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. సీక్రేట్ గా ప్రేమించుకుందామని అనుకుని.. చాలాసార్లు దొరికిపోయారు ఈ జంట. ఇక తాజాగా వీరి నిశ్చితార్ధం అయ్యింది. పెళ్ళి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.
రజినీకాంత్ ముందు మోహన్ బాబు పరువు తీసిన చిరంజీవి