vijay deverakonda, rashmika mandanna
Vijay Deverakonda-Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచుతున్నారు. ఓ రకంగా దోబూచులాడుతున్నారు. ఫెస్టివల్స్ ని కలిసే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
వెకేషన్ కూడా కలిసే ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ బర్త్ డే అయినా, రష్మిక బర్త్ డే అయినా వీరిద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా వరకు వెకేషన్‌కి వెళ్లి అక్కడ రహస్యంగా ప్రేమించుకుంటున్నారు.
vijay deverakonda, rashmika mandanna
అయితే ఆ విషయంలో మాత్రం చిన్న సస్పెన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకే చోట ఉన్నా, ఆ విషయాన్ని డైరెక్ట్ చెప్పకుండా, కాస్త సస్పెన్స్ లో పెట్టి, ఇంకాస్త దాగుడు మూతలు ఆడుతూ అసలు విషయాన్ని వెల్లడిస్తున్నారు.
గత రెండు మూడేళ్లుగా ఈ ఇద్దరు చేస్తున్నది ఇదే. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. ఏప్రిల్ 5న రష్మిక మందన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓమన్ వెళ్లింది రష్మిక. అక్కడే బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది.
rashmika mandanna, vijay deverakonda
మొదట రష్మిక మందన్నా సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పంచుకుంది. సముద్రపు ఒడ్డున బోట్‌లో ఆమె విందు ఆరగిస్తుంది. స్మైలీ లుక్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన ప్రేమని వ్యక్తం చేసింది.
బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ సైతం ఆమెకి విషెస్ తెలియజేశారు. రష్మిక ఫోటోల్లో విజయ్ కనిపించలేదు. దీంతో ఈ సారి ఒంటరిగానే వెళ్లిందా అనే అనుమానాలు క్రియేట్ అయ్యాయి. నెటిజన్లు కూడా కాస్త డిజప్పాయింట్ అయ్యారు.
vijay deverakonda
దానికి ఫుల్ స్టాప్ పెట్టాడు విజయ్ దేవరకొండ. రష్మిక మందన్నా సస్పెన్స్ ని బహిర్గతం చేశాడు. తాను కూడా ఆదివారం వెకేషన్ ఫోటోలను పంచుకున్నారు. ఓమన్‌లోనే, రష్మిక మందన్నా ఉన్న చోట నుంచే ఆయన దిగిన పిక్స్ ని అభిమానులతో షేర్ చేశారు.
బీచ్‌లోని ఇసుకపై నడుస్తూ, హార్స్ రైడ్ చేస్తూ, బోట్‌లో కూర్చొని దిగిన పిక్స్ ని పంచుకున్నారు. ఇప్పుడివి వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు దొంగలు దొరికిపోయినట్టు అయ్యింది.
vijay deverakonda, rashmika
వీరి విషయంలో విసిగిపోయిన నెటిజన్లు ఇంకా ఎన్నాళ్లు దాగుడు మూతలంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒకటి తేల్చేయాలని అడుగుతున్నారు. ఎక్కువ సాగదీసినా వర్కౌట్ కాదు, త్వరగా తేల్చుకోవాలని సలహాలిస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.
ఇంకా కొంత కాలం వేచి ఉండే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది లో వీరి రిలేషన్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటారా? ఫ్రెండ్స్ గానే ఉండిపోతారా? అనేది వచ్చే ఏడాది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.