టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎవరికి ఉండకుండా ఉంటుంది చెప్పండి. స్టార్ డైరెక్టర్లు కూడా మహేష్ బాబు కోసం ఎదురు చూసిన రోజులు లేకపోలేదు. ఒక దర్శకుడు మాత్రం మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడట. ఎంత ప్రయత్నం.. చేసినా మహేష్ తో సినిమా చేయలేకపోయాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు. ఎందుకు సినిమా చేయలేకపోయాడు.
Mahesh Babu
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలామంది దర్శకులు కలలు కంటుంటారు. మహేష్ కు కథ నచ్చి సినిమా ఒకే అన్నాడంటే, ఇక ఆడైరెక్టర్ కు పండగే. ఆసినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ హట్ అయ్యేలా తెరకెక్కించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. అలాసక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో మహేష్ బాబు సినిమా వల్ల స్టార్లు గా మారినవారు కూడా ఉన్నారు.
అయితే ఒక దర్శకుడు మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా ప్రయత్నం చేశాడట. అతను ఎవరో కాదు వి.వి వినాయక్. ప్రస్తుతం ఫామ్ అవుట్ అయిన వినాయక్.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేశాడు వినాయక్. ఆది, ఠాగూర్, నాయక్,చెన్నకేశవరెడ్డి. ఇలా వినాయక్ ఖాతాలో అద్భుతాలెన్నో.
వినాయక్ మహేష్ బాబుతో సినిమా చేయాలి అని చాలా కథలు రాసుకున్నాడని సమాచారం. కొన్ని కథలు కూడా మహేష్ బాబుకు వినిపించాడట. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎందుకో మహేష్ బాబుతో సినిమా సెట్స్ వరకూ వెళ్ళలేదట. కొన్న కథలు మహేష్ రిజెక్ట్ చేయడం, కొన్ని నచ్చినా.. మహేష్ డేట్స్ కుదరకపోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల వినాయక్ మహేష్ తో మూవీ చేయలేదట.
Puri Jagannath, V.V Vinayak, rajamouli
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీని ఏలిన వినాయక్.. ఇప్పుడు పూర్తి ఫామ్ ను కోల్పోయి, సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నారు. ఇక త్వరలో వినయక్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఫ్రేష్ గా, ఈ ట్రెండ్ కు తగ్గట్టుగా ఆయన కథలు రాసుకున్నారట. మరోసారి మెగా ఫోన్ పట్టడానికి వినాయక్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రవితేజ హీరో ఒక భారీ సినిమాను ఆయన ప్లాన్ చేస్తున్నాడట. ఈసినిమా సక్సెసె అయితే మళ్లీ వినాయక్ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ మహేష్ బాబుతో సినిమా ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.
అటు మహేష్ బాబు మాత్రం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ.. బిజీగా ఉన్నాడు. ఈ మూవీ రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో మహేష్ బాబు స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తద్వారా పాన్ వరల్డ్ సినిమా ప్రేక్షకులకు కూడా దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి సైతం ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. మరి ఈ సినిమా ఏంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.