విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది.. పట్టరాని ఆవేశం వచ్చింది. ఆ బాధ నాకు తెలుసు. వాళ్లను వదిలేయకండి.. ఏదో ఒకటి చేయాల్సిందే.. అంటూ రౌడీ హీరో డిమాండ్ చేశారు. ఇంతకీ విషయం ఏంటో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు పట్టరాని కోపం వచ్చింది. ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై అప్పుడప్పుడు స్పందించే విజయ్.. కొన్ని విషయాలలలో కాస్త అగ్రసీవ్ గానే స్పందిస్తుంటాడు. నన్ను కదిలిస్తే ఎవరికైనా ఇచ్చిపడేస్తాను అని ఓ సందర్బంలో విజయ్ స్వయంగా అన్నారు. అయితే తాజాగా విజయ్ కు ఓ విషయం బాగా కోపం తెప్పించింది. అదేదో కాదు.. తమిళంలో.. దళపతి విజయ్ జననాయగన్ సినిమా లీక్ అవ్వడం.. దేవరకొండకు కోపం తెప్పించింది.
25
సోషల్ మీడియాలో రౌడీ హీరో పోస్ట్..
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాకి సంబంధించిన కీలక ఫుటేజ్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ మూవీ టీమ్ కు తన పూర్తి సపోర్ట్ ను ప్రకటించారు.
35
ఆ బాధేంటో నాకు కూడా తెలుసు..
తన పోస్టులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “‘జన నాయగన్’ లీక్ వార్త నాకు కోపం తెప్పించింది. నా కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి అనుభవం నాకు కూడా ఎదురయ్యింది. ఆ బాధ, నష్టం ఎలా ఉంటాయో నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఈ చర్య కేవలం ఒకరిపై దాడి కాదు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎందరివో కలలు, శ్రమ దీనిపై ఆధారపడి ఉంటాయి” అని అన్నాడు.
విజయ్ ఇంకేమన్నాడంటే '' ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, లీక్ వెనుక ఉన్న వారిని గుర్తించాలి, లేదంటే ఇది వ్యవస్థ వైఫల్యంగా పరిగణించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఈ లీక్ వివాదంపై సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ ఘటన ప్రమాదం కాదని, ఇది వ్యవస్థ వైఫల్యమని వ్యాఖ్యానించారు. సర్టిఫికేషన్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యమే పైరసీకి అవకాశం కల్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
55
కొనసాగుతున్న దర్యాప్తు..
ఇక మెగాస్టార్ చిరంజీవి, అలాగే హీరో సూర్య కూడా ఈ లీకేజీని తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమ మొత్తాన్ని ప్రభావితం చేసే ఇలాంటి చర్యలను అరికట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా లీక్ ఘటనతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.