విక్టోరియా సీక్రెట్‌కు తృప్తి డిమ్రి అంబాసిడర్‌గా మారడం కేవలం ఒక సెలబ్రిటీ ఒప్పందం కాదు, ఇది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ప్రపంచంలోనే ఇండియాకు దక్కిన గౌరవం. దశాబ్దాలుగా ఫారెన్ బ్యూటీలనే తమ బ్రాండ్ అంబాసిడర్లు గా తీసుకుంటున్న విక్టోరీయా సీక్రెట్.. ఇప్పుడు భారతీయ ముఖానికి చోటివ్వడం పెద్ద మార్పుకు సంకేతం.
గ్లోబల్ ఫ్యాషన్‌లో భారత్ కు దక్కుతున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ఆకట్టుకోవడానికి, బ్రాండ్లు ఇప్పుడు వైవిధ్యానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అందులో భాగంగానే ఇండియాన్ మోడల్ కు ఆ కంపెనీ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.