Vijay Rashmika Engagement: ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. పెళ్లెప్పుడంటే

Published : Oct 03, 2025, 11:09 PM IST

నేషనల్ క్రష్ రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిశ్చితార్థం శుక్రవారం రోజు సీక్రెట్ గా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వచ్చే ఏడాది వీరిద్దరి వివాహం జరగనుంది. ఆ వివరాలు ఈ కథనంలో చూడండి. 

PREV
15
Vijay Deverakonda and Rashmika Mandanna

 రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ లవ్ ఎఫైర్ ని విజయ్, రష్మిక ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. కానీ తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. వీరిద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. రష్మిక.. విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులకు కూడా బాగా చేరువైంది. 

25
సీక్రెట్ గా విజయ్, రష్మిక నిశ్చితార్థం 

కాగా ఎట్టకేలకు ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా సీక్రెట్ గా శుక్రవారం రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగింది. దీనితో సోషల్ మీడియాలో అభిమానులు విజయ్, రష్మిక లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందమైన కొత్త జర్నీ ప్రారంభించిన విజయ్, రష్మిక లకు విషెస్ చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ ఆ వార్త బయటకి వచ్చింది. 

35
ఛలో మూవీతో రష్మిక టాలీవుడ్ ఎంట్రీ 

విజయ్ దేవరకొండ పీఆర్ టీం కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ టాలీవుడ్ లో క్రేజీ నటీనటులుగా కొనసాగుతున్నారు. రష్మిక ఛలో చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందు రష్మికకి ఓ కన్నడ నటుడితో నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ నిశ్చితార్థాన్ని రష్మిక వ్యక్తిగత కారణాలతో రద్దు చేసుకుంది. 

45
ప్రేమ చిగురించింది అప్పుడే 

మరోవైపు విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారారు. ఇక అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ జీవితాన్నే మార్చేసింది. విజయ్ కి టాలీవుడ్ లో సరికొత్త ఫాలోయింగ్ ఏర్పడింది. గీత గోవిందం చిత్రంలో, విజయ్ రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో విజయ్, రష్మిక టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడిగా మారారు. ఈ మూవీలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ హైలైట్. అక్కడి నుంచి విజయ్, రష్మిక మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీలో కూడా కలిసి నటించారు. 

55
పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ 

రష్మిక ఇటీవల పుష్ప, ఛావా, యానిమల్ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. మొత్తంగా రష్మిక.. విజయ్ దేవరకొండతో కొత్త జీవితం ప్రారంభించడంలో తొలి అడుగు వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహం జరగనుందట. ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనుంది అని సమాచారం. రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories