Rashmika Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మికల ఫ్యామిలీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Published : Oct 04, 2025, 02:02 PM IST

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో ఉండే జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ప్రేమ బంధాన్ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసిన ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో నిన్న నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరి కుటుంబాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. 

PREV
14
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే వీరు ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీరు ఎప్పుడూ ఆ వార్తలపై స్పందిచలేదు. వారి ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ నిన్న (శుక్రవారం) పెద్దల అంగీకారంతో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వారి వ్యక్తిగత జీవితాలు, కుటుంబ నేపథ్యాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 

24
రష్మిక మందన్న ఫ్యామిలీ..

రష్మిక మందన్న కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా విరాజ్‌పేట పట్టణానికి చెందినవారు. రష్మిక తల్లిదండ్రులు సుమన్ మందన్న, మదన్ మందన్న. రష్మిక తండ్రికి విరాజ్‌పేటలో ఒక కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక తండ్రి ఆమె సినిమా రంగంలోకి కాకుండా, తన వ్యాపారంలోకి రావాలని కోరుకున్నారు. రష్మిక తల్లి సుమన్ మందన్న గృహిణి. రష్మిక తన బలం తన తల్లేనని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రష్మిక సిస్టర్ పేరు శిమన్. రష్మిక జన్మించిన తర్వాత దాదాపు 16 సంవత్సరాలకు శిమన్ జన్మించింది.

రష్మికది సాంప్రదాయ దక్షిణ భారతీయ కుటుంబం కావడం వల్ల, ఆమె సినీ ఇండస్ట్రీలోకి రావడాన్ని మొదట్లో తల్లిదండ్రులు సందేహించారు. వారి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తి రష్మికే. తన బాల్యంలో వారి కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేదని.. డబ్బులకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని రష్మిక చాలా ఇంటర్వూల్లో చెప్పారు. రూమ్ రెంట్ కట్టడానికి కూడా చాలా కష్టపడేవాళ్లమని.. చిన్నప్పుడు బొమ్మలు కూడా కొనుక్కోలేకపోయానని ఆమె అభిమానులతో పంచుకున్నారు.

34
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ..

విజయ్ దేవరకొండది తెలంగాణ ప్రాంతానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. విజయ్ దేవరకొండ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. విజయ్ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్‌ కర్నూల్‌) లోని తుమ్మన్‌పేట అనే చిన్న గ్రామానికి చెందినవారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ , తల్లి మాధవి దేవరకొండ, తమ్ముడు ఆనంద్ దేవరకొండ. 

విజయ తండ్రి టీవీ సీరియల్ డైరెక్టర్. నటుడు కావాలనే కలలను నెరవేర్చుకోవడం కోసం తన గ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ కెమెరా భయం కారణంగా నటుడు కాలేకపోయారు. తర్వాత టీవీ సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్షన్ వైపు వెళ్లారు. విజయ్ తల్లి మాధవి దేవరకొండ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్‌గా పని చేస్తారు. సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా తెలుగు సినిమా నటుడే. విజయ్, ఆనంద్ ఇద్దరూ పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు విజయ్ చాలాసార్లు అభిమానులతో పంచుకున్నారు.

44
ఇద్దరూ కష్టపడి ఎదిగినవారే..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి పనిచేసినప్పటి నుంచే వారి బంధం గురించి ఊహాగానాలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే రష్మికకు 2017 లో హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగింది. కానీ 2018లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కుటుంబాలు వేర్వేరు ప్రాంతాలకు చెందినప్పటికీ.. వారిద్దరూ కష్టపడి పైకి వచ్చినవారే. తక్కువ టైంలోనే సినిమా పరిశ్రమలో ఇద్దరూ మంచి స్థానాలను సంపాదించుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories