Vijay Devarakonda Life: బ్యాంకులో రూ.500 లేని పరిస్థితి నుండి కోట్లు సంపాదించే స్థాయికి విజయ్ ఎలా చేరుకున్నాడు?

Published : Oct 04, 2025, 01:10 PM IST

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమాలకు అభిమానులు ఎక్కువే. ఒకప్పుడు విజయ్ దేవరకొండ జీవితం వేరు.. ఇప్పటి జీవితం వేరు. అతను నేడు కోట్లాదిమందికి ఆదర్శప్రాయమైన నటుడిగా మారిపోయాడు. ఆయన జీవితమే అతనికి ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పింది. 

PREV
14
కష్టాలతో మొదలైన జీవితం

విజయ్ దేవరకొండ జీవితం వెండి స్పూన్ తో మొదలవలేదు. చిన్నతనంలోనే నాన్న పడిన కష్టాలు చూస్తూ పెరిగాడు వ్యక్తిగత జీవితం నుంచే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ఈ స్టార్ డమ్ వెనుక ఆయన చిన్నతనంలో చూసిన ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, తండ్రి పడిన వేదన, కుటుంబ బాధ్యతలు.. అన్నీ అతనికి స్ఫూర్తి నింపినవే. ఇతను తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని తుమ్మలపేట అనే చిన్న గ్రామానికి చెందినవారు. సినిమాల్లోకి వచ్చిన ప్రారంభ రోజుల్లో బ్యాంకు ఖాతాలో కనీసం 500 రూపాయలు కూడా ఉండేది కాదు. దీనివల్ల మినిమమ్ బాలన్స్ లేదని అతడి బ్యాంకు ఖాతా ను లాక్ చేశారు కూడా. అలాంటిది ఇప్పుడు ఒక్క సినిమాకి కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకుంటున్నారు. తండ్రి కోసం కోటి రూపాయలు కన్నా విలువైన కారును కూడా కొన్నారు.

24
తండ్రి పడిన కష్టాలు చూసి

విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావు దేవరకొండ. అతనికి చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలని ఇష్టం ఉండేది.అందుకే గ్రామం నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు. కానీ కెమెరా ముందు నిల్చుంటే చాలు చెమటలు పట్టేసేవి. ఆ భయం కారణంగా నటుడు అవ్వలేకపోయేవాడు. దీంతో టీవీ సీరియల్ డైరెక్షన్ వైపు వెళ్లారు. విజయ్ కుటుంబాన్ని పోషించేందుకు తన తండ్రి పడే కష్టాన్ని చూసి తీవ్రంగా ప్రభావితం అయ్యారు. ఒకసారి తండ్రి ఎండలో బస్సు కోసం ఎంతో సేపు వేచి ఉండడం చూశారు. బస్సు వచ్చినప్పుడు వల్ల అతని రద్దీ వల్ల బస్సు ఎక్కలేక పడిన ఇబ్బందిని కూడా చూశారు. బస్సులో గంటలు తరబడి నిలబడి ప్రయాణాలు చేశారు. తన కుటుంబ స్థితిని తానే మార్చాలని తండ్రిని మళ్లీ బస్సు ఎక్కనివ్వకుండా చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. తన తండ్రికి ఖరీదైన కారును ఇవ్వాలని భావించారు.

34
తల్లి ఏం చేసేవారు?

ఇక విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ. సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా పనిచేసేవారు. ఆమె తన కొడుక్కి ఆత్మవిశ్వాసాన్ని, వాక్చాతుర్యాన్ని పెంచుకోవడంలో సహాయపడ్డారు. విజయ్ దేవరకొండకి ఒక తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అతడు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాక అమెరికాలో డెలాయిట్ కంపెనీలో పనిచేశారు. అన్నయ్య సినిమాల్లో స్థిరపడడంతో తాను కూడా సినీ రంగంలోకి వచ్చాడు.

44
రష్మికతో పెళ్లి జరిగితే

సినిమాల్లో విజయ్ దేవరకొండ ఎంతో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తారు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన చాలా తెలివైనవాడు. నమ్మదగిన వ్యక్తి. తన వివాహాన్ని పూర్తి ప్రేమ వివాహంగా కాకుండా పెద్దల ద్వారా జరిగేలా ప్రవర్తించారు. అతనికి ఆర్థిక సంకల్పం ఎక్కువ. చిన్న చిన్న క్యారెక్టర్లతో మొదలైన విజయ్ దేవరకొండ సినీ జీవితం, పెళ్లి చూపులు సినిమాతో టర్న్ తిరిగింది. సోలో హీరోగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అర్జున్ రెడ్డి అతనికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. గీతగోవిందం సినిమా రష్మికను ఆయన జీవితంలో అడుగుపెట్టేలా చేసింది. అందుకే ఈ మూడు సినిమాలు అతని జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే ఫెయిల్యూర్లు కూడా ఎదురవుతూనే ఉన్నాయి. రష్మిక ఆయన జీవితంలోకి ఎదురయ్య ప్రవేశించాక జీవితం మరింత బాగుంటది అని ఆశిద్దాం.

Read more Photos on
click me!

Recommended Stories