ప్రభాస్ కొత్త సినిమా ది రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు, కానీ OTT డీల్ ఫైనల్ కాకపోవడంతో నిర్మాతల్లో టెన్షన పెరిగిపోయింది. 400 కోట్ల బడ్జెట్ సినిమాను పెద్ద మొత్తానికి కొనడానికి ఏ ప్లాట్‌ఫామ్ ముందుకు రాకపోవడంతో మేకర్స్ ఆందోళనలో ఉన్నారు.
ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా రాజాసాబ్. వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోన్న ది రాజా సాబ్' కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మధ్యలో ప్రభాస్ సినిమా మేకర్స్ లో ఆందోళన పెరిగిపోతోంది. అసలు విషయం ఏంటంటే, మేకర్స్ ఇంకా ఈ సినిమా OTT డీల్ కోసం ఎదురుచూస్తున్నారు, ఇప్పటివరకు ఏ ప్లాట్‌ఫామ్ ఫైనల్ కాలేదు.
25
నిర్మాతల్లో టెన్షన్
రాజాసాబ్ ఓటీటీ డీల్ కంప్లీట్ అవ్వకపోవడంతో నిర్మాతల్లో టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించారు, ఏ పెద్ద OTT ప్లాట్‌ఫామ్ కూడా ఈ సినిమాపై అంత పెద్ద మొత్తం పెట్టడానికి ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. దాంతో ఓటీటీ రిలీజ్ పై ఇంకా స్పష్టత రాలేదు. ఈ డీల్ ను ఎలా కంప్లీట్ చేయాలా అన్న టెన్షన్ లో ఉన్నారు నిర్మాతలు
35
ఓటీటీలతో మేకర్స్ చర్చలు
రాజాసాబ్ మేకర్స్ ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కానీ టాప్ ప్లాట్‌ఫామ్స్ ఈ హారర్ కామెడీని భారీ మొత్తానికి కొనడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇది ఎక్కువగా తెలుగు నేటివిటీ ఉన్న సినిమా కావడంతో, పాన్ ఇండియా లెవల్లో ఈసినిమా వర్కౌట్ అవుతుందా లేదా అని ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ పాయింట్ తో మేకర్స్ నిరాశ చెంది, తక్కువ ధరకు ఈ సినిమా డీల్ చేసుకుంటారని వాళ్లు ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం, ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. కానీ 'ది రాజా సాబ్' ఆయన సాధారణంగా చేసే యాక్షన్ సినిమా కాదు. అందుకే OTT యజమానుల మనసులో ఈ సినిమాపై సందేహాలు ఉన్నాయి. ఇక మేకర్స్ ఈ సినిమాకు OTT డీల్ కుదిరితే కాస్త ఊపిరిపిల్చుకునే అవకాశం ఉంది. రాజాసాబ్ హిందీ రైట్స్ నెట్ ప్లిక్స్ తీసుకోబోతున్నట్టు రూమర్ వైరల్ అవుతోంది. నిర్మాతలు ఎప్పటికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో తమ డీల్ లాక్ చేస్తారో చూడాలి.
55
'రాజా సాబ్' షూటింగ్ అప్ డేట్
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోనన రాజాసాబ్ సినిమాలో నిధిఅగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కేవలం ఒక రొమాంటిక్ పాట మాత్రమే మిగిలి ఉంది, అది డిసెంబర్‌లో షూట్ చేస్తారు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా నిర్మాణంలో ఉంది, ఇందులో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్ కూడా ముఖ్య పాత్రలో ఉన్నారు. మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. మొదట 2025 డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా ఈమూవీని 2026 జనవరి 9న కి పోస్ట్ పోన్ చేశారు.